// // New Planet Discovered:కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. చేరుకోవడం సాధ్యమేనా..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

New Planet Discovered:కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. చేరుకోవడం సాధ్యమేనా..?

New Planet Discovered:కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. చేరుకోవడం సాధ్యమేనా..?
Advertisement

New Planet Discovered:సోలార్ సిస్టమ్‌లో ఇప్పటివరకు 8 ప్లానెట్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటితో పాటు కొంతకాలం క్రితం ఓ కొత్త గ్రహాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా నాసా చేసిన పరిశోధనల్లో మరో గ్రహం వారి కంటపడింది. ఈ గ్రహం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అప్పుడే పరిశోధనలు మొదలుపెట్టేశారు.

భూమికంటే 95 శాతం పెద్దగా ఉన్న ఈ గ్రహం.. 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త గ్రహానికి వారు టిఓఐ 700 ఈ అనే పేరుపెట్టారు. అయితే ఈ గ్రహంపై మనుషులను జీవించవచ్చా అనే ప్రశ్న అప్పుడే శాస్త్రవేత్తల్లో మొదలైంది. కానీ వారికి దొరికిన సమాధానం మాత్రం అంత ఆశను కలిగించేలా లేదని తెలుస్తోంది.

Advertisement

ఈ గ్రహంపైకి వెళ్లడం మన జీవితకాలంలో జరగదని శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పేశారు. కానీ ఇలాంటి వాటి గురించి మాట్లాడడం మాత్రం బాగుంటుందని ఈ కొత్త గ్రహం గురించి వారు మరిన్ని వివరాలు బయటపెట్టారు. ఈ గ్రహం 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నందువల్ల అక్కడికి ప్రయాణించడానికి ఓ స్పేస్ క్రాఫ్ట్‌ను తయారు చేసినా కూడా అక్కడికి చేరుకోవడానికి మనకు 100 సంవత్సరాలు పడుతుందని వారు తెలిపారు.

నక్షత్రాల మధ్య నుండి లైట్‌ వేగంతో ప్రయాణించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ వేగాన్ని అందుకోవాలంటే ఒక సెకనుకు 186,000 మైలు ప్రయాణించవలసి ఉంటుందని వారు తెలిపారు. ఒకవేళ ఆ గ్రహానికి చేరుకోవడం సక్సెస్ అయితే అది కచ్చితంగా సైన్స్ విభాగంలో ఓ కొత్త రికార్డును సృష్టించనుంది.

Advertisement

లైట్ వేగంతో స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించవలసి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంత వేగంతో వెళుతున్నప్పుడు మధ్యలో చిన్న అంతరాయం వచ్చినా దాని వల్ల కలిగే నష్టం భారీగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందుకే ఇప్పటివరకు నక్షత్ర మండలంలోకి స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించే సాహసాన్ని ఎక్కువగా శాస్త్రవేత్తలు చేయలేదు. ఈ విభాగంలో కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకొని వారు చేసిన పరిశోధనలు తక్కువే.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×