E-Paper
Advertisement

Lithium-air batteries : లిథియం-ఎయిర్ బ్యాటరీ.. 4 రెట్లు మెరుగైన పనితీరు..

Lithium-air batteries : లిథియం-ఎయిర్ బ్యాటరీ.. 4 రెట్లు మెరుగైన పనితీరు..
Advertisement

4 times better performance with lithium-air batteries.

ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన జేఏసీ ఆటో కంపెనీ… లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోడియం-అయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… లిథియం-అయాన్ బ్యాటరీ కంటే నాలుగు రెట్లు మెరుగ్గా పని చేసే కొత్త బ్యాటరీని కనిపెట్టడం. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఐఐటీ, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ అర్గోన్ నేషనల్ లాబొరేటరీ పరిశోధకులు… లిథియం-ఎయిర్ బ్యాటరీ డిజైన్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ కంటే నాలుగు రెట్లు మెరుగ్గా పని చేస్తుందని… దీన్ని దేశీయ విమానాలు, దూరప్రాంతాలకు తిరిగే ట్రక్కుల్లో వాడొచ్చని చెబుతున్నారు.

లిథియం-ఎయిర్ బ్యాటరీలో సాధారణ ద్రవ రకానికి బదులుగా ఘన ఎలక్ట్రోలైట్ వాడారు. దీని వల్ల ఇది వేడెక్కడం కానీ, మంటలు చెలరేగడం కానీ జరగదని పరిశోధకులు చెబుతున్నారు. ఘన ఎలక్ట్రోలైట్‌… బ్యాటరీ శక్తిని లిథియం-అయాన్ బ్యాటరీల కంటే నాలుగు రెట్లు పెంచుతుందని, దీని వల్ల వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కలుగుతుందని అంటున్నారు. ఈ ఘన ఎలక్ట్రోలైట్ నానోపార్టికల్ రూపంలో… చౌకైన మూలకాలతో తయారు చేసిన సిరామిక్ పాలిమర్ పదార్థంతో కూడి ఉంటుందని పేర్కొన్నారు. ఇది సాధారణ వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని పనిచేస్తుందని, ఆక్సిజన్ ట్యాంక్‌లను ఆపరేట్ చేయాల్సిన అవసరాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. గతంలో చేసిన పరీక్షల్లో లిథియం-ఎయిర్ బ్యాటరీ లైఫ్ సైకిల్ చాలా తక్కువగా ఉందని, ప్రస్తుతం దాన్ని వెయ్యి లైఫ్ సైకిల్స్ స్థాయికి పెంచగలిగామని, దీని వల్ల కొత్త బ్యాటరీల ఉత్పత్తికి ఆటంకం ఉండదని పరిశోధకులు నిర్ధారించారు. చార్జింగ్, డిశ్చారింగ్ విషయంలో లిథియం-ఎయిర్ బ్యాటరీ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని పరీక్షల్లో తేల్చారు. దీని సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా పరీక్షలు జరుపుతామని పరిశోధకులు ప్రకటించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×