E-Paper
Advertisement

3D Printing : ఇప్పుడు 3డి ప్రింటింగ్ మరింత సులభం..!

3D Printing : ఇప్పుడు 3డి ప్రింటింగ్ మరింత సులభం..!
Advertisement
3D Printing

3D Printing : 3డి అనేది టెక్నాలజీని ఎంతగానో ముందుకు తీసుకెళ్లింది. ముఖ్యంగా బయోలజీ విభాగంలో 3డి ప్రింటింగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ప్రతీ టెక్నాలజీ ఏదో ఒక ప్రతికూలత ఉంటుంది. 3డి బయోప్రింటింగ్ ప్రక్రియ అనేది చాలా సమయం తీసుకుంటుంది. అదే ఇందులో ప్రతికూలత. దానిని దూరం చేయడానికే శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు.

బయోలజీకల్ పదార్థాలను ఫ్యాబ్రికేట్ చేయడానికి 3డి ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతుంది. 3డి ప్రింటింగ్ ఎన్నో విధాలుగా ఉపయోగపడిన.. ఇది చాలా స్లో ప్రక్రియ. అంటే ఇందులో పదార్థానికి సంబంధించిన ఒక లేయర్ లేదా ఒక లైన్ మాత్రమే ఒకసారి తయారు చేయడం కుదురుతుంది. అయితే ఇలా కాకుండా ఒక సింగిల్ షాట్‌లో 3డి ప్రింటింగ్ ద్వారా మెటీరియల్‌ను ఎలా తయారు చేయవచ్చు అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

Advertisement

తాజాగా అల్ట్రాసౌండ్ ద్వారా మెటీరియల్‌ను సింగిల్ షాట్‌లో 3డి ప్రింట్‌ను తయారు చేశామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇది బయోప్రింటింగ్‌ను ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో ఉపయోగించిన సెల్స్ ఎంతో సెన్సిటివ్ అని వారు అన్నారు. మామూలుగా సౌండ్ వేవ్స్ అనేవి ఎలాంటి ప్రెజర్‌ను క్రియేట్ చేస్తాయో చాలామందికి తెలుసు. అలాంటి హై ఫ్రీక్వెన్స్ అల్ట్రాసౌండ్‌ను ఉపయోగించే 3డి ప్రింటింగ్‌ను సులభతరం చేయనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్లాస్, హైడ్రోజల్‌లాంటి వాటితో ఈ అల్ట్రాసౌండ్ ఫీచర్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని ద్వారా సెల్ కల్చర్స్‌ను, టిష్యూలను 3డిలో తయారు చేయడం సులభంగా మారుతుందని వారు హామీ ఇస్తున్నారు. అల్ట్రాసౌండ్ అనేది టిష్యూ లోపలివరకు చేరుకొని అందులోని బయోలాజికల్ సెల్స్‌ను ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇది సెల్స్‌పై ఎలాంటి చెడు ప్రభావం కూడా చూపించదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×