E-Paper
Advertisement

whisky : స్కాచ్ విస్కీ @ రూ.22.49 కోట్లు

whisky : స్కాచ్ విస్కీ @ రూ.22.49 కోట్లు
Advertisement
whisky

whisky : అదో అరుదైన స్కాచ్ విస్కీ. అరుదైనది కాబట్టి ధర కూడా ఎక్కువే ఉండొచ్చు. ఇంతకీ ఆ విస్కీ బాటిల్ విలువ ఎంతో ఊహించగలరా? ఒకటీ అరా కాదు.. ఏకంగా రూ.22.49 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిల్ ఇదేనని చెబుతున్నారు.

ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోథబీస్(Sotheby’s) శనివారం ఆ బాటిల్‌ను వేలం వేసింది. ప్రపంచంలో అధిక డిమాండ్ ఉన్న స్కాచ్ విస్కీ బాటిళ్లలో మెకాలిన్ అదామీ 1926 సింగిల్ మాల్ట్ (Macallan Scotch whisky) ఒకటి. వేలంలో ఈ బాటిల్‌కు ఊహించిన దాని కన్నా రెట్టింపు ధర లభించడం విశేషం.

Advertisement

విస్కీ ఎంత పాతదైతే దాని రుచి అంతగా పెరుగుతుంది. దాంతో పాటే ధర కూడా ఆకాశాన్ని అంటుతుంది. ఈ విస్కీ 97 ఏళ్ల నాటిది. దీనిని 60 ఏళ్ల పాటు పీపాల్లో నిల్వ చేశారు. 1986లో మెకాలిన్ 40 బాటిళ్ల విస్కీని సిద్ధం చేసింది. ఇప్పటివరకు వాటిలో ఒకే బాటిల్‌ను వినియోగించినట్టు తెలుస్తోంది. కొన్ని బాటిళ్లు మాత్రం మెకాలిన్ టాప్ క్లయింట్లకు చేరాయి.

మెకాలిన్ 1926 సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ బాటిళ్లను ఎప్పుడు వేలం వేసినా.. ఊహించని రీతిలో ధర లభిస్తుంటుందని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి బాటిల్‌నే 2019లో వేలం వేయగా రూ.15.56 కోట్లు పలికింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×