E-Paper
Advertisement

Dubai Gold Dress: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..

Dubai Gold Dress: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..
Advertisement

Dubai Gold Dress: గోల్డ్ రేటు ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఒక గ్రాము బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇండియాలో ఉంది. కానీ దుబాయిలో మాత్రం గోల్డ్ తోనే ఓ డ్రెస్సును రూపొందించారు. సౌదీ అరేబీయాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ.. అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యూలరీ ఈ డ్రెస్సును డిజైన్ చేసింది.

ఈ డ్రస్సు బరువు 10 కిలోల 81 మిల్లీ గ్రాములు. ఈ డ్రెస్సులో కిరీటం, భారీ నక్లెస్, చెవిపోగులు, నడుపు అలంకరణ వంటి నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు 4.6 మిలియన్ థామ్‌లు అంటే.. ఇండియన్స్ కరెన్సీలో రూ. 10 నుండి రూ.11 కోట్లు అనమాట. ఈ దుబాయి డ్రెస్సును షార్‌జాలో జరిగిన 56వ మిడిల్ మిడిల్ ఈస్ట్ షోలో ప్రదర్శించారు.

Advertisement

కిరీటం తయారీకి 398 గ్రాములు, 8,810 గ్రాముల బరువుతో నెక్లెస్, నడుము అలంకరణకు 738.5 గ్రాముల బంగారం. చెవిపోగులకు 134.1 గ్రాముల బంగారం వాడారు. దీన్ని రూపొందించడానికి డిజైనర్లు 90 గంటలపాటు కష్టపడ్డారట. గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందడంతో లభించే అంతర్జాతీయ ప్రచారం.. దాని తయారు ఖర్చు కంటే చాలా ఎక్కువ విలువైనదిగా పరిగణించవచ్చు

ఇది కంపెనీ బ్రాండు, ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. UAE సంస్కృతిలో, మిడిల్ ఈస్ట్‌లో బంగారం తరతరాలుగా, సంపదకు, ప్రతిష్టతకు, సాంప్రదాయానికి చిహ్నంగా ఉంటుంది. ఈ దుస్తులను దుబాయి డ్రెస్సు అని పిలవడం వల్ల.. స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వడంతో పాటు.. ప్రపంచ స్థాయి విలాసవంతమైన వస్తువుగా దీన్ని ఉంచడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బంగారం డ్రెస్సు తయారుచేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు అందుకుంది ఆల్ రొమైజాన్ సంస్థ.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×