E-Paper
Advertisement

Women, Peace Security Index: ఇక్కడ స్త్రీలే సారథులు.. అతివల భద్రత, సాధికారతకు చిరునామాగా నిలుస్తున్న దేశాలివే!

Women, Peace Security Index: ఇక్కడ స్త్రీలే సారథులు.. అతివల భద్రత, సాధికారతకు చిరునామాగా నిలుస్తున్న దేశాలివే!
Advertisement

Women, Peace Security Index: ఎక్కడైతే స్త్రీలు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా.. అత్యంత స్వేచ్ఛగా, సురక్షితంగా, పురుషులతో పాటు సమాన అవకాశాలను కలిగి ఉంటారో ఆ దేశాలు నిజంగా అభివృద్ధి సాధించినట్లు తాజా సర్వే ఒకటి స్పష్టం చేసింది. మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రపంచంలోనే బెస్ట్ దేశాలేవి? అనే ప్రశ్నకు జార్జిటౌన్‌ ఫర్‌ ఉమెన్‌, పీస్‌ అండ్‌ సెక్యూరిటీ, పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఓస్లో సంయుక్తంగా విడుదల చేసిన ‘ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్‌ 2025-26 నివేదిక సమాధానం ఇచ్చింది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు యూరప్‌ దేశాల్లోనే ఉన్నాయని తేలింది. భద్రతా ప్రమాణాలు, సామాజిక భాగస్వామ్యం, విద్యా-ఆర్థిక అవకాశాలు వంటి అనేక అంశాలను పరిశీలించారు. ఫలితంగా యూరప్ దేశాలు మహిళల హక్కులు, స్వేచ్ఛ, సమాన అవకాశాల విషయంలో టాప్‌లో నిలిచాయి.

టాప్‌లో డెన్మార్స్ దేశం:

WPS ఇండెక్స్‌ 2025 జాబితా ప్రకారం.. డెన్మార్క్ 0.939 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో స్త్రీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎంతో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే బలమైన సంక్షేమ పథకాలు, తక్కువ ఖర్చుతో శిశు రక్షణ, సురక్షితమైన పబ్లిక్‌ ప్రదేశాలు, లింగ ఆధారిత హింస చాలా తక్కువగా ఉండటం వంటి అంశాలు డెన్మార్క్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి.

Advertisement

మహిళల భద్రత, స్వేచ్ఛ విషయంలో డెన్మార్క్ తర్వాత 0.932 స్కోర్‌తో ఐస్‌లాండ్‌ రెండోస్థానంలో ఉంది. ఇక్కడ స్త్రీల భాగస్వామ్యం ఎక్కువ శాతం మగవాళ్లకు సమానంగా ఉంది. దీంతోపాటు గృహహింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి.

ఇకపోతే నార్వే, స్వీడన్ సంయుక్తంగా 0.924 స్కోర్‌తో మూడో స్థానాన్ని అందుకున్నాయి. ఈ రెండు దేశాల్లోనూ రాజకీయాలు, ఉన్నత యాజమాన్యాల్లో అతివలకు పెద్దపీట వేయడంతోపాటు బలమైన కార్మిక సంఘాలు, సమాన వేతన చట్టాలు వారి భద్రతకు భరోసా అందిస్తున్నాయి.

Advertisement

అలాగే ఫిన్‌లాండ్‌(0.921), లక్జెంబర్గ్‌(0.918), బెల్జియం(0.912) వరుసగా 5, 6, 7 స్థానాలను పొందాయి. ఈ దేశాల్లో పార్లమెంటులో అధిక మహిళా ప్రాతినిధ్యం, మెరుగైన విద్య, ఆర్థిక స్వేచ్ఛ, వివక్షకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టాలు ఉండటంతో ముందు వరుసలో నిలిచాయి. మొత్తం మీద ఈ దేశాలన్నీ స్త్రీల అత్యంత భద్రత, సాధికారతకు కేవలం చట్టాలు చేస్తే సరిపోదని.. వాటిని సమర్థంగా అమలు చేస్తూ, సామాజికంగా సమానత్వ భావనను పెంపొందించడం ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. వీటితో పాటు నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, న్యూజీలాండ్‌ కూడా మహిళల స్వేచ్ఛ, భద్రత, సమానత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నాయి.

సమస్యాత్మక దేశాలివే:

స్త్రీలు స్వేచ్ఛగా జీవించడానికి ఆఫ్ఘనిస్తాన్‌, యెమెన్‌, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌, సిరియా, సూడాన్‌ వంటి దేశాల్లో సురక్షిత వాతావరణం లేదని WPS ఇండెక్స్‌ 2025 విడుదల చేసిన జాబితా సూచిస్తుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×