E-Paper
Advertisement

US Tariff Verdict: ట్రంప్ కు షాకిచ్చిన ఇండో అమెరికన్ లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్?

US Tariff Verdict: ట్రంప్ కు షాకిచ్చిన ఇండో అమెరికన్ లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్?
Advertisement

US Tariff Verdict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. టారిఫ్ లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన న్యాయవాది నీల్ కత్యాల్.. భారత సంతతి చెందిన వ్యక్తి. అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న నీల్ కత్యాల్.. డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను రద్దుకు కారణమైన పిటిషన్ లో వాదనలు వినిపించారు.

కాంగ్రెస్ కు మాత్రమే అధికారం

గతంలో యునైటెడ్ స్టేట్స్ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ పనిచేసిన నీల్ కత్యాల్.. ట్రంప్ వాణిజ్య విధానాలు, దిగుమతులపై రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు విధిస్తున్నారని వాదనలు వినిపించారు. ఈ సుంకాలు విధించడానికి 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ని ఉపయోగించడాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం తీర్పు తర్వాత నీల్ కత్యాల్ మాట్లాడుతూ.. “ఇవాళ యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు చట్టబద్ధమైన పాలన కోసం నిలబడింది, అమెరికన్లు ప్రతిచోటా ఉన్నారు. అధ్యక్షుడు శక్తివంతమైనవారే, కానీ రాజ్యాంగం ఇంకా శక్తివంతమైనది. కాంగ్రెస్ మాత్రమే అమెరికన్ ప్రజలపై పన్నులు విధించగలదు” అన్నారు.

రాజ్యాంగ మైలురాయి

Advertisement

ఈ కేసును అమెరికన్ వ్యాపారస్తులు దాఖలు చేయగా, లిబర్టీ జస్టిస్ సెంటర్ మద్దతు ఇచ్చింది. వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితులుగా పేర్కొంటూ, జాతీయ భద్రత, ఆర్థిక పరిస్థితి కోసం సుంకాలు విధించడాన్ని ట్రంప్ సమర్థించారు. నీల్ కత్యాల్ సుప్రీం తీర్పును రాజ్యాంగపరమైన మైలురాయిగా చెప్పారు. ఈ కేసు అధ్యక్ష పదవి గురించేనని, ఏ ఒక్క అధ్యక్షుడి గురించి కాదన్నారు. ఈ తీర్పు అధికారాల విభజన గురించి మాత్రమే, రాజకీయాల గురించి కాదన్నారు. 250 సంవత్సరాలుగా ప్రభుత్వానికి పునాదిగా ఉన్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను కాపాడుతుందని కత్యాల్ అన్నారు.

Also Read:  ప్రపంచ దేశాలపై యూఎస్ 10 శాతం సుంకాలు.. భారత్ కు భారీ ఊరట

ఎవరీ నీల్ కత్యాల్?

Advertisement

నీల్‌ కత్యాల్‌ అమెరికాలోని షికాగోలో జన్మించారు. కత్యాల్ తల్లిదండ్రులు భారత్‌ నుంచి వచ్చిన వలసదారులు. తల్లి ప్రతిభ డాక్టర్, తండ్రి సురేందర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. నీల్ .. యేల్‌ లా స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కెరీర్‌ ప్రారంభంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ స్టీఫెన్‌ బ్రేయర్‌ వద్ద క్లర్క్ గా పనిచేశారు. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో యూఎస్‌ యాక్టింగ్ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు యూఎస్ సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించారు. గతంలో పలుమార్లు ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా నీల్‌ కోర్టుల్లో వాదనలు వినిపించారు. 2017లో ట్రంప్‌ తొలి ప్రభుత్వంలో కొన్ని దేశాలపై విధించిన ట్రావెల్ ఆంక్షలకు వ్యతిరేకంగా నీల్‌ కత్యాల్ వాదనలు వినిపించారు. నీల్ కత్యాల్.. “ఇంపీచ్‌: ది కేస్‌ అగైనెస్ట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌” అనే పుస్తకాన్ని కూడా రాశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×