E-Paper
Advertisement

USA: బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలు.. దాని విలువ తెలిస్తే షాక్..

USA: బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలు.. దాని విలువ తెలిస్తే షాక్..
Advertisement

USA: ఆర్ట్ వర్క్ ప్రదర్శనల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వస్తువులు, కళారూపాలు, పెయింటింగ్స్ ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అనేక దేశాల్లో ఈ ప్రదర్శనలు జరుగుతుంటాయి. అరుదైన కళాఖండాలను చూడాలంటే ఈ ప్రదర్శనకు వెళ్లాల్సిందే. ఇక ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ‘ఇక్కడ కళాఖండాలను తాకొద్దు’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది బోర్డు చూసినా కూడా కావాలనే వాటిని తాకుతుంటారు.

ఇటీవల అమెరికాలోని మియామిలో వీఐపీ ప్రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పాప్ కళాకారుడు జెఫ్ రూపొందించిన బెలూన్ డాగ్ సిరీస్‌లోని నీలం రంగు బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. దాని విలువ రూ. 42 వేల డాలర్లు. అంటే మన డబ్బుల్లో అక్షరాల రూ.43 లక్షలు.

Advertisement

ఇక అసలు విషయానికొస్తే.. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్దురాలు బెలూన్ డాగ్‌ను చూసి ఆశ్చర్యపోయింది. దాన్ని తట్టి చూసింది. దీంతో క్షణాల్లో ఆ బొమ్మ జారి కింద పడి పగిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియక వృద్ధురాలు ఒక్కసారిగా షాక్ అయిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన నిర్వాహకులు.. వృద్ధురాలు కావాలని బొమ్మను తాకలేదని.. అనుకోకుండా జరిగిందన్నారు. బొమ్మకు బీమా ఉండటంతో నష్ట పరిహారం లభిస్తుందని వెల్లడించారు. బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలి పేరును మాత్రం సీక్రెట్‌గా ఉంచారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×