E-Paper
Advertisement

క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!

క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!
Advertisement

Venezuela Earthquake: వెనిజులా రాజధాని కారకాస్‌ సమీపంలో సంభవించిన భారీ భూకంపం.. సిటీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. రిక్టర్ స్కేల్ పై 7.2, 7.5  తీవ్రతతో రెండుసార్లు భూ ప్రకంపనల రాగా.. వాటి ధాటికి నగరం చిగురుటాకులా వణికిపోయాయి. ఇళ్లు, రోడ్లు, విమానాశ్రయం, అత్యంత ఎత్తైన అపార్ట్ మెంట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వాటిని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో భూంకంపం వచ్చిందా? అని నివ్వెరపోతున్నారు.

కారకస్ లోని ఓ బేస్ బాల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా ఈ భూకంపం వచ్చింది. దీంతో స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్ధం కాక వారంతా స్టేడియం మధ్యలోకి పరిగెత్తిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

మరో వీడియోలో రోడ్డుపై పార్క్ చేసిన కార్లు షేక్ కావడం చూడవచ్చు. అంతేకాకుండా ఓ పెద్ద భవనం పైఅంతస్తులోని స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు ధారగా కిందకు పడటం గమనించవచ్చు. భూ ప్రకంపనల ధాటికి రోడ్డుపై ఉన్న ప్రజలు తలోదిక్కు పరిగెత్తడం.. ఒక్కసారిగా ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

వెనిజులాలోని లా గ్వైరా తీరంలోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఓ మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఆ దృశ్యాలను అతడు తన సెల్ ఫోన్ లో బంధించాడు. ప్రస్తుతం అవి కూడా వైరల్ అవుతున్నాయి.

తీరప్రాంత నగరమైన లా గ్వైరా నగరంలో భూకంపం దాటికి భారీ అపార్ట్ మెంట్లు సైతం నేలకూలాయి. దీంతో అప్పటివరకూ ఎంతో అందంగా కనిపించిన నగరం.. దెబ్బతిన్న భవనాలు, కుప్పకూలిన అపార్ట్ మెంట్లు శిథిలాలతో భయానకంగా మారింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి రికార్డు చేయగా.. అవి కూడా వైరల్ అవుతున్నాయి.

మరో వీడియోలో ఓ భవనం పైన ఉన్న ప్రహారీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఓ మహిళ ముందే గమనించి.. ఆ భవనానికి దూరంగా పరిగెత్తడంతో ఆమెకు ప్రాణపాయం తప్పింది.

భూకంపం అనంతరం అక్కడి భయానక పరిస్థితులను ఓ వ్యక్తి కారులో వెళ్తూ తన ఫోన్ లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సైతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వీడియోలో కనుచూపు మేర ఎటు చూసిన దెబ్బతిన్న అపార్ట్ మెంట్లు, కుప్పకూలిన ఇళ్లు, వ్యాపార భవనాలు కనిపిస్తున్నాయి. మీరు కూడా వీడియోలో చూడొచ్చు.

ఇంకో వీడియోలో ఇటీవల పునః నిర్మించిన హోటల్ ఎడ్వర్డ్.. పూర్తి స్థాయిలో కుప్పకూలి ఉండటం చూడవచ్చు. ప్రకృతి విలయానికి ముందు హోటల్ ఎలా ఉంది.. ఆ తర్వాత ఎలా మారిందో ఈ వీడియోలో గమనించవచ్చు. కాగా ఘటన సమయంలో హోటల్లో బస చేస్తున్న బేస్ బాల్ క్రీడాకారులు గోర్కీస్ హెర్నాండెజ్, ఎలియేజర్ అల్ఫోంజోల కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండ్ అవుతున్న మరో భయానక వీడియోలో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టడాన్ని చూడవచ్చు. భూ ప్రకంపనల ధాటికి భవనాలు కుప్పకూలుతుండగా.. స్థానికులు తమ పిల్లలను వెంటబెట్టుకొని దూరంగా పారిపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. భూకంప సమయంలో పరిస్థితులు ఎంత భయానకంగా ఉందో చెప్పేందుకు ఈ వీడియో ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

Also Read: అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

రాజధాని కారకాస్ సమీపంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి ఇప్పటివరకూ 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ప్రకటించారు. 700 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ అధికారిక లెక్కలు ఎలా ఉన్న.. యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) మాత్రం మరణాలు భారీ సంఖ్యల్లో ఉండబోతున్నట్లు అంచనా వేసింది. 10 వేల నుంచి లక్ష మంది వరకూ చనిపోవచ్చని అభిప్రాయపడింది.

Also Read: శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏ క్షణమైనా సైబర్ దాడి!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×