E-Paper
Advertisement

Venezuela: 83 మందిని ఛిద్రం చేసి మరీ.. అధ్యక్షుడిని ఎత్తుకుపోయిన అమెరికా, 2017లోనే ప్లాన్?

Venezuela: 83 మందిని ఛిద్రం చేసి మరీ.. అధ్యక్షుడిని ఎత్తుకుపోయిన అమెరికా, 2017లోనే ప్లాన్?
Advertisement

వెనిజులాలోకి చొరబడి.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకుపోయి.. యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అమెరికా. అంతేకాకుండా.. ఇక ఆ దేశ బాధ్యతలన్నీ తమవే అంటూ గర్వంగా ప్రకటించుకుంది కూడా. అయితే, ఆ రోజు ఏం జరిగింది? అసలు అమెరికా ఎలా చొరబడి.. వెనిజులా అధ్యక్షుడికి అపహరించింది? ఎంతమందిని మట్టుబెట్టిందనే వివరాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వ్లాదిమర్ ప్యాడ్రినో మీడియా ముందుకు వచ్చి.. కీలక విషయాలు వెల్లడించారు.

83 మంది దుర్మరణం.. 112 మందికి గాయాలు

జనవరి 3వ తేదీన అమెరికా జరిపిన ఆకస్మిక దాడుల్లో 83 మంది చనిపోయారని, వీరిలో 9 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్యాడ్రినో పేర్కొన్నారు. చనిపోయిన సైనికుల్లో 32 మంద క్యూబాకు చెందిన కామ్రేడ్లు ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోకి ప్రవేశిస్తూనే అమెరికా సైన్యం బాంబులతో విరుచుకుపడిందని, ఆ వెంటనే అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను బంధించారని వివరించారు. శుక్రవారం జరిగిన సంతాప సభలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు. అయితే, అమెరికా ఆ రోజు విసిరిన బాంబుల వల్ల శవాలన్నీ ఛిద్రమైపోయాయని, ముక్కలుగా ఎగిరిపడ్డాయని తెలిసింది. వాటికి డీఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతే గుర్తించగలిగారట.

2017లోనే ప్లాన్?

Advertisement

వెనిజులాలోకి చొరబడాలనే ఆలోచన ఇప్పటిది కాదట. 2017లోనే ట్రంప్ దీనికి ప్లాన్ చేసినట్లు సమాచారం. కొలబియా మాజీ అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంతోస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ట్రంప్ అమెరికాకు ఫస్ట్ టెర్మ్ అధ్యక్షుడు అయినప్పుడే దీనిపై ప్లాన్ చేశాడు. ఈ మేరకు లాటిన్ అమెరికా లీడర్లతో న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో ట్రంప్ వ్యగ్యంగా మాట్లాడుతూ.. వెనిజులాను చూడండి, దాన్ని మనం చొరబాటుతోనే సరిచేయగలం అని అన్నాడు’’ అని శాంతోస్ తెలిపారు. శాంతోస్ 2010 నుంచి 2018 వరకు కొలంబియాకు అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆ దేశ రెబల్ ఆర్మీ FARCతో శాంతియుత చర్చలు జరిపినందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.

మొత్తానికి ట్రంప్ ఎనిమిదేళ్ల ఎదురుచూపు తర్వాత.. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. అప్పటి ప్లాన్‌ను మరిచిపోకుండా అమల్లోకి పెట్టి ఆశ్చర్యపరిచాడు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి ఆ దేశాన్ని బూచిగా చూపిస్తూ తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన చూపు గ్రీన్‌ల్యాండ్ తదితర దేశాలపై పడింది. మున్ముందు మన శాంతి దూత ఇంకేమి చేస్తాడో చూడాలి.

Advertisement

Also Read: గడ్డకట్టిన సరస్సుపై నడక.. ఇద్దరు మృతి, కెమేరాకు చిక్కిన ఘటన

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×