E-Paper
Advertisement

Notice to TANA: తానాకు ఎఫ్‎బీఐ నోటీసులు.. అసలు కారణాలివే!

Notice to TANA: తానాకు ఎఫ్‎బీఐ నోటీసులు.. అసలు కారణాలివే!
Advertisement

Notice to TANA: అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు తెలుగు టెకీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఆపిల్‌ గ్రాంట్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై.. ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించవచ్చనే భయందోళనలు నెలకొన్నాయి. ఆపిల్‌ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు.. ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆపిల్ సంస్థ నిర్ధారించింది. దాంతో.. నిధుల కుంభకోణంపై FBI, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి.

మరోవైపు.. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకి కూడా మెయిల్‌ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు, ఎలక్ట్రానిక్‌ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు.. ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా పేరుతో అనేక కార్యక్రమాలు ఎన్ఆర్ఐలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు తానాకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటీవల డిసెంబర్ 12న కాలిఫోర్నియా కోర్టు నోటీసులను ఇచ్చింది. అందులో తానా తనకు సంబంధించి అన్ని వివరాలను కోర్టు ఎదుట సమర్పించాలి. అలానే ఎఫ్‎బీఐ( FBI) ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 26వ తారీఖునే డిస్ట్రిక్ట్ కోర్టు హౌస్ సాంగ్ జోష్‌లో వీళ్లు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది.

Also Read: నేపాల్‌లో భారీ భూకంపం.. 7.1‌గా నమోదు

Advertisement

అలాగే FBIకి సంబంధించి స్పెషల్ ఏజెంట్ కాథరిన్ టైలర్‌కు తానా లావాదేవీలా వివరాలు, తానా సభ్యుల వివరాలు, వాళ్లు సేకరించిన విరాళాలు, ఖర్చుపెట్టిన వివరాలు అన్ని కూడా పంపించాలంటూ నోటీసులు జారీచేసింది. ప్రస్తుతం తానాకు నిరంజన్ సంఘవరపు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తెలుగు సంఘాలు రకరకాలుగా విడిపోయాయి. గతంలో నాటాపైన అనేక ఆరోపణలు రావడంతో .. దర్యాప్తు సంస్థలు మూసివేశాయి. ఇప్పుడు తానాకు కూడా అదే గతి పట్టవచ్చన్న ఆందోళన అక్కడ ఉన్న తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. అనేక ఆర్ధికపరమైన అవకతవకలు జరిగాయంటూ తానాపైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతోనే కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×