E-Paper
Advertisement

USA Earthquake: అమెరికాలో మరోసారి భూ ప్రకంపనలు..లాస్‌ఏంజిల్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

USA Earthquake: అమెరికాలో మరోసారి భూ ప్రకంపనలు..లాస్‌ఏంజిల్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత
Advertisement

US earthquake latest news(International news in telugu): అమెరికాలో మరోసారి భూమి కంపించింది. లాస్‌ఏంజిల్స్‌లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతగా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంతో పలు ఇళ్లల్లోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం లాస్‌ఏంజిల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

కాగా, ఇటీవల న్యూజెర్సీలో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో న్యూయార్క్ లోనూ ప్రకంపనలు తాకాయి. వైట్ హౌస్ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. న్యూజెర్సీలో ఇలాంటి భూకంపాలు చాలా అరుదు అని యూఎస్ జీఎస్ పేర్కొంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×