E-Paper
Advertisement

USA: డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు.. నిందితుడి ఆత్మహత్య

USA: డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు.. నిందితుడి ఆత్మహత్య
Advertisement

USA: అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో బాల్‌రూమ్ డ్యాన్స్ క్లబ్ వద్ద కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కాల్పులకు పాల్పడిన హూ కాన్ ట్రాన్(72) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షాట్‌గన్‌తో తనకు తాను కాల్చుకున్నాడు. హూ కాన్ చైనా నుంచి వలస వచ్చి సాన్ గాబ్రియేల్‌లో నివాసం ఉంటూ ట్రక్కు డ్రైవర్‌గా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్‌సీ పేరిట బిజినెస్ ప్రారంభించాడు.

హూ కాన్ ట్రాన్స్ తరచూ స్టూడియోకు వచ్చి అందరితో గొడవ పడే వాడని స్థానికులు తెలిపారు. స్టూడియోలోని సిబ్బందితో అతడికి పడేది కాదని వెల్లడించారు. తన మాజీ భార్యను కలవడానికి వచ్చి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడని.. అయితే ఆమె నిరాకరించడంతో కోపంలో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడని చెప్పారు. కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు చాకచక్యంగా వ్యవహరించి అతడి వద్ద ఉన్న మెషీన్ గన్‌ను లాక్కొన్నట్లు వివరించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×