E-Paper
Advertisement

US Supreme Court: ట్రంప్ టారిఫ్‌లకు అమెరికా సుప్రీంకోర్టు చెక్.. వసూలు చేసిన సుంకాలు వాపస్ ఇవ్వాల్సిందే!

US Supreme Court: ట్రంప్ టారిఫ్‌లకు అమెరికా సుప్రీంకోర్టు చెక్.. వసూలు చేసిన సుంకాలు వాపస్ ఇవ్వాల్సిందే!
Advertisement

US Supreme Court: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలకు అక్కడి సర్వోన్నత న్యాయస్థానం (US Supreme Court) భారీ షాక్ ఇచ్చింది. వివిధ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ టారిఫ్‌లను (సుంకాలను) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను మార్పులకు సంకేతంగా నిలిచింది.

న్యాయస్థానం తన తీర్పులో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, ఇది పూర్తిగా కాంగ్రెస్ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ‘అత్యవసర అధికారాలను’ (Emergency Powers) వినియోగించడం చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేవలం జాతీయ భద్రత పేరుతో ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement

అంతేకాకుండా, ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల డాలర్ల మొత్తాన్ని తిరిగి ఆయా దేశాలకు లేదా సంస్థలకు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ట్రంప్ విదేశీ వాణిజ్య వ్యూహం దెబ్బతిన్నట్లయింది. మరోవైపు, ఈ సానుకూల పరిణామంతో అమెరికా స్టాక్ మార్కెట్లు (US Markets) ఉత్సాహంగా స్పందించాయి. వాణిజ్య యుద్ధం ముగుస్తుందనే ఆశతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ తీర్పు భారత్ సహా చైనా, మెక్సికో వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Read Also: Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×