E-Paper
Advertisement

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారుల మృతి..

అమెరికాలో కాల్పుల కలకలం..  8 మంది చిన్నారుల మృతి..
Advertisement

Mass shooting in Shreveport: అమెరికాలో గన్ కల్చర్ మరోసారి క‌ల‌కలం రేపింది. లూసియానా రాష్ట్రంలోని ష్రీవ్‌పోర్ట్  నగరంలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయసు ఒక్క ఏడాది నుండి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు ధృవీకరించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ దారుణానికి ఒడిగట్టాడని, మృతుల్లో కొందరు అతడికి బంధువులే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ మారణకాండ తర్వాత నిందితుడు ఒక కారును తస్కరించి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో నిందితుడు మరణించినట్లు ష్రీవ్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. సామాన్య ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశంలో చిన్నారులే లక్ష్యంగా ఈ దాడి జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

Advertisement

మరోవైపు, అయోవా యూనివర్సిటీ సమీపంలో కూడా కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ చినికిచినికి గాలివానలా మారి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు అమెరికాలో తుపాకీ నియంత్రణ చట్టాలపై మళ్ళీ చర్చకు దారితీస్తున్నాయి.

Read Also: దెయ్యాలు కూడా జడుసుకునే ఘోరాలు… లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసినా చలించని రాక్షస జంట

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×