E-Paper
Advertisement

హెచ్-1బీ వీసా ఇకపై కఠినతరం.. 30 శాతం వేతనం పెంచాలని సూచన, అక్కడ ఉద్యోగం కష్టమే

హెచ్-1బీ వీసా ఇకపై కఠినతరం.. 30 శాతం వేతనం పెంచాలని సూచన, అక్కడ ఉద్యోగం కష్టమే
Advertisement

H-1B Wages: అమెరికా తన సొంత ఖనాజా నింపుకోవడంపై దృష్టి సారించింది. ఫలితంగా అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునేవారికి మార్గాలను కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది ట్రంప్ సర్కార్. విదేశీ నిపుణులకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని 30 శాతం వరకు పెంచాలని అక్కడి కార్మిక శాఖ ఓ ప్రతిపాదనను రెడీ చేసింది.

ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచ.. హెచ్-1బీ వీసా ఇకపై కఠినతరం

Advertisement

ఒకవేళ ఆ శాఖ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో కార్యకలాపాలు సాగించే ఇండియన్ ఐటీ కంపెనీలపై ఆర్థికభారం పడనుంది. అక్కడ ఉద్యోగాల కోసం వెళ్లేవారి అవకాశాలకు గండిపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలపై దృష్టి సారించింది?

అమెరికాలోని కార్మిక శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం.. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అమెరికాలో పని చేసే విదేశీ నిపుణులకు ఇచ్చే కనీస వేతనాన్ని 30 శాతం వరకు పెంచాలన్నది అందులోని కీలక ప్రతిపాదన. కార్మిక శాఖ ప్రతిపాదన అమల్లోకి వస్తే అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై అధికభారం పడనుంది.

Advertisement

30 శాతం వేతనం పెంచాలని సూచన,  అదే జరిగేత అమెరికాలో ఉద్యోగం కష్టమే

అక్కడ ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న భారతీయుల డాలర్ డ్రీమ్‌కు గండి పడే అవకాశం ఉంది. అమెరికా ఇప్పుడు అమల్లో ఉన్న హెచ్-1బీ వేతనం దాదాపు రెండు దశాబ్దాల కిందట నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. తక్కువ జీతాలకు విదేశీ నిపుణులను నియమించుకుంటూ అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తున్నాయనే ప్రచారం లేకపోలేదు.

దీనివల్ల అమెరికా ప్రజలకు ఉపాధి లేకుండా పోతోంది. దీని ప్రయోజనాలను కాపాడటానికే కొత్త వేతనాల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు కార్మిక శాఖ చెబుతున్నమాట. దీనివల్ల అమెరికన్లు-విదేశీ వారికి మధ్య జీతాల వ్యత్యాసాన్ని తగ్గడమేకాదు సమాన అవకాశాలు కల్పించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.

ALSO READ: నైజీరియాలో ఆగని రక్తపాతం.. మార్కెట్‌పై వైమానిక దాడులు.. 100 మంది బలి!

ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి ప్రస్తుతం 73,279 డాలర్ల నుంచి 97,746 డాలర్లకు పెరగనుంది. అంటే దాదాపు 33.3 శాతం పెంపు అన్నమాట. లెవెల్-2 ఉద్యోగాలకు ఇప్పుడున్న 98,987 డాలర్ల నుంచి 1,23,212 డాలర్లకు పెరగనుంది. పర్సెంటేజ్ విధంగా చూస్తే 24 శాతం. లెవెల్-3 ఉద్యోగాలకు 1,21,979 డాలర్ల నుంచి 1,47,333 డాలర్లకు పెరగనుంది. లెవెల్-4 ఉద్యోగాలకైతే 1,44,202 డాలర్ల నుంచి ఏకంగా 1,75,464 డాలర్లకు చేరనుంది.

అమెరికా ప్రభుత్వం అదే చేస్తే దీని ప్రభావం గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ కంపెనీలపై ఆర్థిక భారం పడనుంది. చిన్న-మధ్య తరహా సంస్థలు భారీ వేతనాలతో ఉద్యోగులను నియమించుకోవడం అసాధ్యంగా మారవచ్చు. ఇప్పుడే కాదు ఆరేళ్ల కిందట అంటే 2020లో ట్రంప్ సర్కార్ ఇలాంటి ప్లాన్ చేసింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. ఈసారి పకడ్బందీగా వ్యవహరించబోతోంది అమెరికా ప్రభుత్వం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×