E-Paper
Advertisement

500% Tariff On India: రష్యా చమురు కొంటే అంతే.. భారత్ పై 500 శాతం సుంకాలు.. ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

500% Tariff On India: రష్యా చమురు కొంటే అంతే.. భారత్ పై 500 శాతం సుంకాలు.. ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
Advertisement

500% Tariff On India: రెండోసారి అధ్యక్ష పీఠమెక్కిన తర్వాత ట్రంప్ విపరీత ధోరణిలో వెళ్తున్నారు. ప్రధాని మోదీ మంచి మిత్రుడంటూనే.. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందని ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. తాజాగా మరో బెదిరింపు బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్‌తో సహా మాస్కో వాణిజ్య భాగస్వాములు రష్యా చమురు కొనుగోలు చేసినందుకు జరిమానా విధించడానికి ఉపయోగించవచ్చని ప్రముఖ రక్షణ హాక్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం అన్నారు.

500 శాతం సుంకాలు

Advertisement

గ్రాహం-బ్లూమెంటల్ ఆంక్షల బిల్లు చట్టసభ ఆమోదం పొందితే.. రష్యా నుంచి చమురు లేదా యురేనియం కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసి… పుతిన్ కు ప్రత్యక్షంగా సహకరించే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం లభిస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ చెబుతున్నారు. కఠిన ఆంక్షలతో మాస్కోను ఆర్థికంగా దెబ్బతీయడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు.

బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ అయ్యాయని, నెలల తరబడిగా చర్చల్లో ఉన్న ఈ బిల్లుకు అధ్యక్షుడు మద్దతును తెలిపారని గ్రాహం చెప్పారు. వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగవచ్చని గ్రాహం అన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్కేల్-బ్యాక్డ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీపై సెనేట్ ప్రస్తుతం చర్చిస్తుంది. తరువాతి వారం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రోజున సెనేట్ కు విరామం ఇస్తారు.

Advertisement

Also Read:  బయటపెట్టిన ట్రంప్.. వెనిజులా చమురు, ఆ డబ్బుపై అమెరికా నియంత్రణ

రష్యా ఆంక్షల బిల్లు

రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ రూపొందించిన ఈ బిల్లు.. రష్యా చమురు, గ్యాస్, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు, ఇతర ఆంక్షలు విధించడానికి అధ్యక్షుడికి అనుమతి లభిస్తుంది. అలా చేయడం వల్ల రష్యా సైనిక చర్యలకు చాలా వరకు నిధులు తగ్గుతాయని అమెరికా భావిస్తుంది. ఆంక్షల ప్యాకేజీలో కొన్ని సవరణలు చేయాలని వైట్ హౌస్ భావించింది. ఏవైనా మార్పులు జరిగాయో లేదో స్పష్టం కాలేదు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి ఒప్పందం కోసం.. ఈ ఆంక్షలు బిల్లు తెస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×