E-Paper
Advertisement

ఇరాన్‌తో చర్చలు విఫలం.. హర్మూజ్ జలసంధి మూసివేయాల‌ని ట్రంప్ సంచలన ఆదేశం!

ఇరాన్‌తో చర్చలు విఫలం.. హర్మూజ్ జలసంధి మూసివేయాల‌ని ట్రంప్ సంచలన ఆదేశం!
Advertisement

Donald Trump: ఇరాన్‌తో జరిపిన కాల్పుల విరమణ.. దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో జరిపిన 21 గంటల సుదీర్ఘ చర్చలు విఫలం కావడంతో, హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. “ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. ఇదే మా ప్రధాన లక్ష్యం” అని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ ట్రూత్ ద్వారా స్పష్టం చేశారు.

నిన్నటి చర్చల్లో జేడీ వాన్స్, స్టీవ్ మెనూచిన్, జారెడ్ కుష్నర్ వంటి హేమాహేమీలు అమెరికా తరపున ప్రాతినిధ్యం వహించారని ట్రంప్ తెలిపారు. చర్చలు చివరి దశలో చాలా స్నేహపూర్వకంగా సాగినప్పటికీ, తమ అణ్వాయుధ కాంక్షను వీడటానికి ఇరాన్ నిరాకరించిందని ఆయన వెల్లడించారు. “నేను రాజకీయాల్లోకి రాకముందు నుండే చెబుతున్నాను, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా ఎప్పటికీ మారనివ్వను. ఇది మా Red Line.” అని ట్రంప్ ఉద్ఘాటించారు. అణ్వాయుధాల విషయంలో రాజీ లేకపోవడం వల్లే దిగ్బంధం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు (Mines) వేసి ప్రపంచాన్ని బెదిరించాలని చూస్తోందని, ఇది కేవలం ‘బ్లాక్ మెయిల్’ మాత్రమేనని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాన్ సైనిక శక్తి ఇప్పటికే దెబ్బతిన్నదని, వారి నాయకత్వం కూడా అస్తవ్యస్తమైందని ఆయన వ్యాఖ్యానించారు. “అమెరికాకు ఆ ప్రాంతం నుండి చమురు అవసరం లేదు. మా దగ్గర అపారమైన చమురు నిధులు ఉన్నాయి. ఇతర దేశాలే ఆ జలసంధిపై ఆధారపడి ఉన్నాయి.” అని ట్రంప్ విశ్లేషించారు. నాటో (NATO) దేశాల వైఖరిపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారు సహాయం చేస్తామని వస్తున్నారని, త్వరలోనే జలసంధిని శుభ్రం చేసి రవాణాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ దిగ్బంధం నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా తన చమురు ఎగుమతులను పెంచుతామని చెబుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఆసియా మరియు ఐరోపా దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ట్రంప్ తన “అమెరికా ఫస్ట్” విధానంలో భాగంగా తీసుకున్న ఈ చర్య, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే కాకుండా, ప్రపంచ ఇంధన భద్రతను కొత్త సవాళ్లలోకి నెట్టేలా కనిపిస్తోంది.

Advertisement

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి, ఐరోపా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ఎదురుదాడికి దిగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని భయపడుతున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశాలపై ఇంధన ధరల భారం మరింత పెరగనుంది.

Read Also:  ఇస్లామాబాద్ శాంతి చర్చలు.. ఇరాన్ వెర్షన్ ఏంటి? చర్చల విఫలం వెనుక అదే కారణమా?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×