E-Paper
Advertisement

America: అమెరికా టార్గెట్ ఫిక్స్ .. ఈసారి 500 శాతం సుంకాలు, చమురు కొనుగోలు చేసే దేశాలకు

America: అమెరికా టార్గెట్ ఫిక్స్ .. ఈసారి 500 శాతం సుంకాలు,  చమురు కొనుగోలు చేసే దేశాలకు
Advertisement

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ని టార్గెట్ చేశారా? ఏదో విధంగా భారత్‌పై సుంకాలు విధించేందుకు సిద్ధపడుతున్నారా? రకరకాల ఎత్తుగడులను అవలంబిస్తున్నారా? కొత్తగా ఇంధనపై ఆంక్షలు బిల్లు అమెరికా తీసుకురానుందా? ఆ బిల్లు పాసైతే భారత్‌కు ఆయిల్ కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కొత్త స్కెచ్- ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలను గమనించారు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు హెచ్చరిక పంపే దిశగా అడుగులు వేస్తోంది ట్రంప్ సర్కార్. ఈ క్రమంలో కొత్త ఆంక్షల బిల్లును తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

రష్యా వద్ద చమురు కొనుగోలు చేస్తే 500 శాతం సుంకాలు-ట్రంప్‌ ప్రభుత్వంతోపాటు నలుగురు సెనెటర్లు ఒప్పందానికి వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిలో రిపబ్లికన్ సెనేటర్లు లిండ్సే గ్రాహం, రోజర్ వికర్‌, డెమోక్రటిక్ సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంతల్, జీన్ షాహీన్‌లు ఉన్నారు. రష్యా యుద్ధానికి ఆర్థికంగా అండగా నిలిచిన దేశాలపై కఠినచర్యలు తీసుకోవడమే ఈ బిల్లు ఉద్దేశంగా చెబుతున్నారు.

రష్యా నుంచి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను చాలా దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అందులో భారత్, చైనాతోపాటు మరికొన్ని దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల లక్ష్యంగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 500 శాతం సుంకం విధించే ప్రతిపాదనతో బిల్లు రెడీ చేసినట్టు సమాచారం.

Advertisement

ఆగష్టులో చట్టసభల ముందుకు బిల్లు-ఈ చట్టానికి సంబంధించిన తుది వివరాలను ఇంకా బహిరంగ పరచలేదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. గల్ఫ్ తర్వాత రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్‌. గతేడాది జూన్‌లో అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ దీనిపై భారత్‌-చైనాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు కూడా.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తే ఆ పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఆ బిల్లులో మరో విషయం కూడా ఉందని తెలుస్తోంది. జాతీయ భద్రతకు అవసరమైతే ఏదైనా దేశానికి 180 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ బిల్లుకు అమెరికా సెనెట్‌లో 84 మంది సభ్యులు మద్దతు తెలిపారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకురావడమే దీనివెనుక కారణంగా చెబుతున్నారు సెనెటర్లు. అమెరికా-ఇరాన్‌ మధ్య సీజ్ ఫైర్ ముగిసింది.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సమయంలో అమెరికా తీసుకురానున్న బిల్లు ఆమోదం పొందితే భారత్‌ పెద్ద దెబ్బేనని అంటున్నారు.

ALSO READ: జైలు కూడు వద్దు.. చికెన్, పాస్తా కావాలి.. తీహార్ జైల్లో అమెరికన్ వింత కోరిక!

దిగుమతులు-వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. భారత్ తన చమురును 88 శాతం సుమారు 41 దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు డజను లోపే ఆ దేశాలు ఉండేవి. 2026 జనవరిలో రష్యా నుంచి రోజుకు 11.6 లక్షల బారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

మొన్నటి వరకు భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా ఉండేది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి క్రూడ్‌ను దిగుమతి చేసుకోడం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. రష్యా కంటే ముందు ఇరాక్, సౌదీలు భారత్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉండేవి.ఇరాక్ నుంచి రోజుకు 10.3 లక్షల బారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×