E-Paper
Advertisement

Iran War: ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో అటాక్, అమెరికా సంచలనం

Iran War: ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో అటాక్, అమెరికా సంచలనం
Advertisement

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైన దాడులు చేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన ప్రకటన చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు ప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. తాము ముందుగా నిర్ణయించుకున్న సమయానికే ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ పంపిన హెచ్చరికలను ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అర్థం చేసుకుంటే ఆ దేశానికే మంచిదని హితవు పలికారు. ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూఏఈలోని అత్యంత కీలకమైన రువాస్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి ధాటికి రిఫైనరీ భారీగా దెబ్బతింది. భద్రతా కారణాల దృష్ట్యా రిఫైనరీ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ రిఫైనరీ మూతపడటం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ డ్రోన్ దాడుల వెనుక ఎవరున్నారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అక్కడి రక్షణ దళాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

Advertisement

అమెరికా రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే గల్ఫ్ తీరానికి భారీగా చేరుకుంది. క్షిపణులు అలాగే యుద్ధ విమానాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొజ్తబా నాయకత్వంలోని ఇరాన్ ప్రభుత్వం అమెరికా హెచ్చరికలకు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

పశ్చిమ ఆసియా దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. యూఏఈ ఆయిల్ రిఫైనరీపై జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. అగ్రరాజ్యం తన వ్యూహాన్ని అమలు చేస్తే ఇరాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. రానున్న కొద్ది గంటలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Advertisement

ALSO READ: LPG price hike: వంట గదిపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఎల్‌పీజీ ధరలు, హైదరాబాద్‌లో ఎంతంటే..?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×