E-Paper
Advertisement

America Snow Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 8 వేలకు పైగా విమానాలు రద్దు

America Snow Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 8 వేలకు పైగా విమానాలు రద్దు
Advertisement

America Hail Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుపాను విరుచుకుపడుతుంది.

విమానాలు రద్దు

మంచు తుపాను కారణంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. శనివారం నాటికి 3,200 విమానాలు, ఆదివారం 4,800 విమాన సర్వీసులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో రవాణా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అంచనా వేశారు. మంచు తుపాను కారణంగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.

స్కూళ్లకు సెలవులు

Advertisement

చికాగో, ఇతర మిడ్‌వెస్ట్రన్ నగరాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విమానయాన సంస్థలు వేలాదిగా విమానాలను రద్దు చేశారు. చర్చిలు, సన్ డే ఈవెంట్స్ ను, కార్నివాల్ ను రద్దు చేశారు. టెక్సాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది. తుపాను ముగిసిన తర్వాత మంచు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చెట్లు, విద్యుత్ లైన్లు పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఇంటికే పరిమితం

తుపాను తీవ్రత పెరుగుతుండడంతో.. కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని, ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. చికెన్, గుడ్లు, పిజ్జాలను తీసుకుంటున్నారు. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో మంచుతో రోడ్లు నిండిపోయాయి. మంచు తుపాను ఈశాన్య దిశగా కదులుతుంది. వాషింగ్టన్ నుండి న్యూయార్క్, బోస్టన్ మీదుగా కదులుతుందని జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Also Read:  రష్యాను ముంచేసిన మంచు తుఫాన్.. మంచు మంచిదేనా..?

అతి తీవ్రమైన మంచు తుపాను

కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్‌, జార్జియా, మిసిసిపి సహా చాలా రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెన్సీ విధించారు. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మిస్సోరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు కురుస్తుంది. ప్రతికూల వాతావరణంతో వాహనాలు మంచులో కూరుకుపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దశాబ్దిలోనే అతి తీవ్రమైన మంచు తుపానుగా చెబుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×