E-Paper
Advertisement

Iran Vs America War: ఖార్గ్ ఐలాండ్‌‌ ఆపరేషన్‌కు అమెరికా ప్లాన్? భారీగా ఇరాన్ బలగాలు, ఆ భయం..

Iran Vs America War: ఖార్గ్ ఐలాండ్‌‌ ఆపరేషన్‌కు అమెరికా ప్లాన్? భారీగా ఇరాన్ బలగాలు, ఆ భయం..
Advertisement

Iran Vs America War: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం జఠిలమైతే టార్గెట్ ఏంటి? దేనిపై అమెరికా ఫోకస్ చేసింది. ఖార్గ్ ఐలాండ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోందా? తన సైన్యాన్ని అమెరికా అటు వైపు తరలిస్తోందా? దాన్ని కంట్రోల్‌లోని తీసుకుంటే ఇరాన్ లొంగిపోతుందని భావిస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఖార్గ్ ఐలాండ్‌‌ ఆపరేషన్‌కు అమెరికా ప్లాన్

Advertisement

యుద్ధం సమయంలో చర్చలు వస్తాయి. ఒక్కసారి ఆ చర్చలు విఫలమైతే.. ఈసారి మరింత ఉధృతంగా యుద్ధం సాగుతుంది. ఎందుకంటే నెల రోజుల యుద్ధంలో ప్రత్యర్థుల బలాబలాలను ఇరుదేశాలు అంచనా వేస్తాయి. వాటికి అనుగుణంగా వూహ్యాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్నది కూడా అదే.

ఇరాన్‌కు ఆర్థిక వనరు ఖార్గ్ ద్వీపం. ఎందుకంటే ఇరాన్‌కు అత్యంత ముఖ్యమైన చమురు ఎగుమతి కేంద్రం కూడా. పర్షియన్ గల్ఫ్‌లో ఈ చిన్న రాతి ప్రాంతం అది. ఇరాన్ 90 శాతం పైగా ముడి చమురు రవాణాను ఆ ప్రాంతం నుంచి నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో 2.8 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఆయిల్ కోసం లోతైన ఓడ రేవులు కూడా ఉన్నాయి.

Advertisement

భారీగా ఇరాన్ బలగాలు, మందుపాతరల భయం

మార్చి 13న అమెరికా ఈ ద్వీపంపై దాడి చేసింది. అక్కడున్న సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్టు తెలిపింది. కేవలం చమురు మౌలిక సదుపాయాల జోలికి వెళ్లలేదు. ఇరాన్ ప్రధాన భూభాగానికి కేవలం 15 మైళ్ల దూరంలో ఉంది. పరిస్థితి గమనించిన ఇరాన్.. దీన్ని మరింత పటిష్టం చేసింది. దీవి చుట్టూ భారీ ఎత్తున సైనికులను మొహరించింది.

త్రివిధ దళాలలను రంగంలోకి దింపింది. రక్షణ వ్యవస్థలను ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసింది. దీవిలోకి ఎవరూ రాకుండా మందుపాతరలను తరలించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా మందుపాతరలు అమర్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరాన్‌ను అమెరికా తక్కువ అంచనా వేయలేదు.

యూఎస్ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లు, యుద్ధ నౌకలను ఆ ప్రాంతం వైపు తరలించేందుకు సిద్ధమవుతోంది. ఖార్గ్ ద్వీపాన్ని అష్ట దిగ్బంధనం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో భూతల పోరు వస్తే అందుకు అనుగుణంగా బలగాలను మోహరిస్తున్నట్లు అందులోని సారాంశం. ఈ లెక్కన ఖార్గ్ ద్వీపం పతనమవుతుందా?

ALSO READ: భారత్‌కు హార్ముజ్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్ కీలక నిర్ణయం..

లేకుంటే మూసివేస్తారా? ఇరాన్ చమురు ఆదాయం రాత్రికి రాత్రే మాయమవుతుందా? ఈ చిన్న ద్వీపాన్ని ఇరాన్ ఎలా కాపాడుకుంటుందో? అమెరికా సైన్యానికి చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుండి సుమారు 1,000 మంది సైనికులు ఈ ప్రాంతానికి తరలించనుంది. భూతల ఆపరేషన్‌లోకి దిగితే అమెరికా సైన్యం ప్రాణనష్టం గణనీయంగా ఉంటుందని అమెరికా అధికారులు, సైనిక నిపుణులు హెచ్చరించారు.

ఎందుకంటే దీవి చుట్టూ మందుపాతరలు ఉంటాయని భయపడుతోంది. గగనతలం నుంచి క్షిపణుల దాడి వల్ల అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే గల్ఫ్‌లోని అమెరికా కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×