E-Paper
Advertisement

మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత

మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత
Advertisement

Iran Vs America War: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. రాత్రి నుంచి ఇరాన్‌పై భీకర దాడులకు దిగింది అమెరికా. ముఖ్యంగా ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత మోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. హోర్మూజ్‌ జలసంధి సమీపంలో సోమవారం అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ కూలిపోవడమే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది అమెరికా.

అమెరికా హెలికాప్టర్ ఘటన.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

Advertisement

ఇరాన్ యుద్ధం ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించలేదు. తాజాగా హోర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా హెలికాప్టర్ ఇరాన్ కూల్చివేసిందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ప్రతీకార దాడులు దిగుతామని తేల్చిచెప్పారు. ట్రంప్‌ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అమెరికా సైన్యం దాడులకు దిగింది.

ఇరాన్‌‌పై తాము దాడులు చేపడుతున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. హోర్మూజ్‌ జలసంధి సమీపంలో ఖేష్మ్‌ దీవిపై బాంబు దాడులు వినిపించినట్లు ఇరాన్‌ మీడియా స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత.. మళ్లీ ప్రపంచ దేశాల్లో టెన్షన్

హోర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఒమన్‌ తీర ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా అమెరికా మిలిటరీ హెలికాప్టర్‌ అపాచీ కూలి పోయింది. అందులోని ఇద్దరు పైలట్లు సేఫ్‌గా బయట పట్టారు. ఇరాన్‌ దాడి కారణంగా తమ హెలికాప్టర్‌ కూలిపోయినట్లు అమెరికా దర్యాప్తులో తేలినట్టు వార్తలు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఇరాన్ రియాక్ట్ అయ్యింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి సోషల్ మీడియా ఓ పోస్ట్‌ పెట్టారు. గల్ఫ్ తీరాలకు అమెరికా వేల మైళ్ల దూరంలో ఉందన్నారు. మన భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ బలగాలు వారి సొంత తప్పిదాలు, ప్రమాదాలు లేదా ఇరుపక్షాల మధ్య సమస్యల వల్ల నిరంతరం ప్రమాదంలో ఉన్నాయని రాసుకొచ్చారు.

ALSO READ: హోర్మూజ్ జలసంధి దగ్గర.. కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌, పైలట్లు సేఫ్

ప్రమాదాన్ని తగ్గించడానికి వారు అక్కడి నుంచి వెళ్లిపోవడమే ఉత్తమ పరిష్కారమని ప్రస్తావించారు.  ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే కష్టాలు తప్పవని వాదన మొదలైంది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×