E-Paper
Advertisement

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?
Advertisement

Straight Of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య ఏం జరుగుతోంది? కవ్వింపు చర్యలకు అమెరికా పాల్పడుతోందా? చర్చలు-ఒప్పందాల పేరుతో దాడులకు తెగబడుతోందా? ఇలాగైతే ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కష్టమేనా? హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి దేనికి సంకేతం? దీనిపై అంతర్జాతీయ మీడియా ఏమంటోంది?

హోర్ముజ్ జలసంధి సమీపంలో హై టెన్షన్

Advertisement

రేపో మాపో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జలసంధి సమీపంలో అమెరికా సైన్యం-షిప్‌ల రవాణాకు ముప్పు పొంచి ఉందని భావించి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

బందర్ అబ్బాస్ సమీపంలోని ఓ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేసినట్టు ఆదేశానికి చెందిన ఓ అధికారి చెప్పినట్టు ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ నాలుగు డ్రోన్లు ప్రయోగించినట్టు పేర్కొంది. వాటిని అమెరికా బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించారు.

Advertisement

ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి,  ఆపై ఎదురుదాడి

టెహ్రాన్‌ మరిన్ని దాడులకు పాల్పడకముందు తమ దళాలు దాని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రస్తావించారు. ఈ దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనేది ఇంకా తెలియాల్సివుంది. చర్చల పేరుతో అమెరికా చేస్తున్న దాడులపై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఫైర్ అయ్యింది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ధ్వజమెత్తింది. అయితే ఈ దాడులకు ముందు ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ ఓడరేవు సమీపంలో భారీగా పేలుళ్లు వినిపించాయి. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్‌ వైమానిక దళాలు యాక్టివేట్ అయ్యాయి. ఇరాన్ డ్రోన్ లాంచింగ్ యూనిట్‌పై అమెరికా సైన్యం దాడి చేసినట్లు సమాచారం.

ALSO READ: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన నౌకాశ్రయ సిటీ బందర్ అబ్బాస్ ప్రాంతం. ఈ దాడులకు రెండు రోజుల ముందు అమెరికా.. దక్షిణ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ పేరుతో దాడులు చేపట్టిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉండగా అమెరికా బలగతాలు జరిపిన దాడికి ప్రతిస్పందనగా అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది.

ఆ స్థావరం ఎక్కడ అనేది తెలుపలేదు. మరోవైపు అబ్రహాం ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. గల్ఫ్‌ దేశాలపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. క్యాబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, అబ్రహాం ఒప్పందాలపై పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, తుర్కీ, ఖతార్‌, సౌదీ అరేబియా సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటామని స్పష్టం చేశారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×