E-Paper
Advertisement

హోర్మూజ్ జలసంధి దగ్గర.. కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌, పైలట్లు సేఫ్

హోర్మూజ్ జలసంధి దగ్గర.. కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌, పైలట్లు సేఫ్
Advertisement

Apache Helicopter Crash: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెల కొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే హెలికాప్టర్ విమానంలోని ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పులు జరిగి ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది.

హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిన  అపాచీ హెలికాప్టర్‌

Advertisement

సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యిది. కాకపోతే ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. హర్మూజ్‌పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ అపాచీ హెలికాప్టర్లు మోహరించింది.

ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లతో పహారా కాస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం సమయంలో రీపర్ డ్రోన్‌లను కూల్చి వేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దీంతో అపాచీ హెలికాప్టర్‌ ఇరాన్ దాడుల్లో కూలిందా? ఏదైనా సాంకేతికలోపం తలెత్తిందా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

ఫైలట్లు సేఫ్.. విచారణ మొలుపెట్టిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు మొదలైన నుంచి యూఎస్‌ సైనిక హెలికాప్టర్‌ కూలిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అమెరికా సైన్యం వెల్లడించలేదు.

పరిస్థితిని ఇంకా సమీక్షిస్తున్నామని, పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. హోర్మూజ్ జలసంధి ప్రాంతంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ తన సైనిక గస్తీని పెంచింది. అందులో అపాచీ హెలికాప్టర్లు, MQ-9 రీపర్ డ్రోన్‌లు, అలాగే F/A-18, F-35 యుద్ధ విమానాల మోహరించింది.

ALSO READ: నియంత్రణ తప్పిన రావలకోట్ నిరసన.. 150 మంది మృతి?

సముద్ర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిన హోర్ముజ్ జలసంధిలో భద్రతను కాపాడటం, ప్రత్యర్థుల నుంచి ముప్పును ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహంలో భాగంగా అక్కడ అమెరికా సైన్యానికి చెందిన బలగాలు మకాం వేసిన విషయం తెల్సిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×