E-Paper
Advertisement

Ukraine-Russia war : మూడో ప్రపంచ యుద్ధానికి నాంది.. మొదటి అటామిక్ క్షిపణి ప్రయోగించిన ఉక్రెయిన్.. అంతటా ఉత్కంఠ

Ukraine-Russia war : మూడో ప్రపంచ యుద్ధానికి నాంది.. మొదటి అటామిక్ క్షిపణి ప్రయోగించిన ఉక్రెయిన్.. అంతటా ఉత్కంఠ
Advertisement

Ukraine-Russia war :  అనుకున్నట్లుగానే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం శృతిమించుతోంది. జెలెన్ స్కీ కోరుతున్నట్లుగా దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి బైడెన్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. రష్యాపైకి ఆధునిక ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో.. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

అమెరికా తయారు చేసిన ATACM దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యా పైకి ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలోని లక్షిత ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా తయారీ ఆయుధాలు వినియోగించింది. ఉక్రెయిన్ సేనలు ఆరు దీర్ఘశ్రేణి ATACM క్షిపణుల్ని తెల్లవారుజామున 3.25 గంటలకు ప్రయోగించాయి. వీటిని రష్యన్ దళాలు విజయవంతంగా అడ్డగించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే.. బ్రయాన్స్క్ లోని ఓ సైనిక శిబిరంపై ఈ క్షిపణి శకలాలు పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు రష్యా ప్రకటించింది. అయితే.. అలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని వెల్లడించింది. క్షిపణి పూర్తిస్థాయిలో ట్రాక్ చేసినట్లు తెలిపిన రష్యా అధికారులు.. దాని శకలాల్ని సైతం సేకరించిన అమెరికా తయారీ క్షిపణిగా నిర్ధరించారు.

Advertisement

రష్యాలోని సుదీర్ఘ లక్ష్యాల్ని నాశనం చేసేందుకు అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి చూస్తోంది. కానీ.. ఆమెరికా సహా నాటో దేశాలు అందుకు అంగీకరించడం లేదు. జెలెన్ స్కీ మాత్రం.. ఉక్రెయిన్ సైన్యం దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని ప్రయోగించేందుకు అనుమతించాలంటూ కోరుతూనే ఉన్నారు. ఈ విజ్ఞప్తుల్ని ఇన్నాళ్లూ పక్కన పెట్టిన అగ్రరాజ్యం అమెరికా.. ఇటీవల ఉత్తర కొరియా సేనలు రష్యాలో మోహరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ కారణంగానే.. దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి పచ్చ జెండా ఉపింది. ఈ దాడులతో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో గేమ్ ఛేంజర్ అవుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు.

ఇటీవలే అణు క్షిపణుల ప్రయోగాలకు స్వేచ్ఛనిచ్చేలా అణు విధానానికి క్రెమ్లిన్ విధానపరమైన మార్పులు చేసింది. దాని ప్రకారం.. రష్యాకు నష్టం కలిగించే, తమ సరిహద్దుల్ని ఉల్లంఘించే.. ఎలాంటి చర్యలు చేపట్టినా, ఏదైనా తీవ్ర స్థాయి వైమానిక, క్షిపణి ప్రయోగాలు జరిగినా.. రష్యా అణు దాడులు చేసేందుకు అనుమతిస్తూ.. ఈ సవరణలు చేశారు. అలానే.. అణు బాంబులున్న ఏదైనా దేశం సాయంలో మరేదైనా దేశం తమపై దాడికి ప్రయత్నిస్తే.. తాము ఆ రెండు దేశాలు కలిసి చేస్తున్న యుద్దంగానే పరిగణిస్తామని రష్యా తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా అణు దాడికి దిగవచ్చంటూ.. తాజా సవరణలు తెలుపుతున్నాయి. దాంతో.. ప్రస్తుత దాడుల్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తే.. అణు దాడులకు సైతం వెనుకాడకపోవచ్చని అనుమానిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×