E-Paper
Advertisement

భారతీయుల కోసం యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఎవరు అర్హులు, అవసరమైన పత్రాలేంటి?

భారతీయుల కోసం యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఎవరు అర్హులు, అవసరమైన పత్రాలేంటి?
Advertisement

UAE Visa On Arrival: భారతీయ పాస్‌పోర్టుదారులకు ముఖ్య గమనిక. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యూఏఈ వెళ్లాలనుకుంటున్నారా? కేవలం భారత పాస్‌పోర్టు ఉంటే చాలదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా ఉండాలి. లేకుంటే రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికి సదుపాయం వర్తించనుంది. ఈ క్రమంలో ఎవరు అర్హులు, ప్రయాణానికి ముందు ఏయే అంశాలు తెలుసుకోవాలనే దానిపై ఓ లుక్కేద్దాం.

భారతీయుల కోసం యూఏఈ వీసా ఆన్ అరైవల్-వీసా విషయంలో ఒక్కో దేశం కొన్ని నిబంధనలు తీసుకొస్తుంటాయి. తాజాగా యూఏఈ ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆ దేశం నుంచి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం పొందాలంటే భారతీయులు కొన్ని ప్రమాణాలను పాటించాలి. సాధారణ పాస్‌పోర్టు కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి. కింది దేశాల నుంచి జారీ చేసిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేకుంటే రెసిడెన్స్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించింది.

Advertisement

కొత్త నిబంధనలేంటి? గతంలో ఈ తరహా నిబంధనలు అమెరికా, యూకె, యూరోపియన్ యూనియన్-ఈయూ సభ్య దేశాల ఉన్నవారికి అందుబాటులో ఉండేది. గతేడాది ఫిబ్రవరి 13 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ జాబితాను కాస్త విస్తరించింది. కొత్తగా వివిధ దేశాల రెసిడెన్స్ పర్మిట్లున్న భారతీయులకు ఈ అర్హతను కల్పించింది. వాటిలో ఆస్ట్రేలియా, కెనడా,జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలున్నాయి.

అవసరమైన పత్రాలు ఏంటి? అర్హత ఉన్న ప్రయాణికులు తమ వెంట తప్పనిసరిగా డాక్యుమెంట్లను ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి. అనుమతి పొందిన దేశాల నుంచి జారీ చేయబడిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉండాలి. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ఇతర సహాయక ప్రయాణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ప్రయాణికులు యూఏఈలోకి ప్రవేశించే నాటికి తమ క్వాలిఫైయింగ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ చెల్లుబాటులో ఉందని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎయిర్‌లైన్ సిబ్బంది, యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు.. దేశంలోకి ప్రవేశానికి అనుమతించే ముందు ఆయా పత్రాలను పరిశీలించే అవకాశం ఉంది.

Advertisement

నార్మల్‌గా అయితే అర్హత కలిగిన భారతీయులకు 14 రోజుల వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తారు. అవసరమైతే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, రుసుములకు లోబడి మరో 14 రోజులపాటు పొడిగించుకోవచ్చు. వీసా కేటగిరీలు, సర్వీస్ ఫీజులు మారే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు బయలు దేరే ముందు యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు, తమ ఎయిర్‌లైన్‌ అధికారులతో తాజా నిబంధనలు, ఛార్జీల గురించి తెలుసుకోవడం బెటర్.

ALSO READ: అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

విదేశాల్లో నివసించేవారికి వర్తిస్తుందా? భారత్ వెలుపల నివసించేవారికి ఈ వీసాకు అర్హత కాదు. పైన ప్రస్తావించిన అర్హత గల దేశాల్లో ప్రయాణికుడు తప్పనిసరిగా ఒకదాని నుండి వ్యాలిడ్ వీసా లేకుంటే రెసిడెన్స్ పర్మిట్‌ను ఉండాలి. ఈ జాబితాలో లేని దేశాల్లో ఉండే భారతీయులు, ప్రయాణానికి ముందు యూఏఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పద్దతి వల్ల కెనడా, ఆస్ట్రేలియా సహా అనేకమంది భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం భారత పాస్‌పోర్ట్ ఈ సదుపాయానికి అర్హత కాదన్నది నిబంధన.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×