E-Paper
Advertisement

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..
Advertisement

Philippines: ఫిలిప్పీన్స్‌లో కల్మెగి తుఫాను బీభత్సం సృష్టించింది. సెబు, ఈస్టర్న్ సమర్, సదరన్ లేయ్టే, బోహూల్, సగే, గుయిమరస్, పలవాన్ ప్రాంతాలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 40 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సెబు ప్రావిన్స్‌లో ప్రభావం అధికంగా ఉందన్నారు. భారీ వరదల కారణంగా జనం ఇళ్లపైకి చేరి.. రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

ఇళ్ల పైకి చేరి రక్షించాలంటూ వేడుకుంటున్న జనం..
వరదల కారణంగా రోడ్లపైకి చెత్తాచెదారం భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేదాకా రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యమంటున్నారు. వరద నీళ్లలో కార్లు, కంటైనర్లు తేలియాడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యల కోసం వెళ్లిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిపారు.

Advertisement

Also Read: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

186 డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేసిన అధికారులు..
కల్మెగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడంతో.. బోట్లు, ఫెర్రీలను నిలిపివేసింది. దీంతో.. ఐల్యాండ్స్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో 3 వేల 500 మంది ప్రయాణికులు పోర్టుల్లో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. దాదాపు 186 డొమెస్టిక్ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×