E-Paper
Advertisement

2 Tried to Kill Me – Elon Musk: నాపై కూడా రెండుసార్లు హత్యాయత్నం జరిగింది: ఎలాన్ మస్క్..!

2 Tried to Kill Me – Elon Musk: నాపై కూడా రెండుసార్లు హత్యాయత్నం జరిగింది: ఎలాన్ మస్క్..!
Advertisement

Two People Tried to Kill me Said by Elon Musk: అమెరికాలోని పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన చెవి గాయంతో బయటపడ్డారు. ఈ క్రమంలో సోషల్ మీడియా(ఎక్స్) ఒక వినియోగదారుడు ఎలాన్ మస్క్ ను ఓ ప్రశ్న అడిగాడు. ‘దయచేసి మీ భద్రతను 3 రెట్లు పెంచుకోండి.. ట్రంప్ కే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మిమ్మల్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారు’ అంటూ ఆ యూజర్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్ పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘నేను ప్రమాదకరమైన కాలాన్ని దాటి వచ్చాను. గత 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు. వారు టెస్లా కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టయ్యారు’ అంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవికి తాకింది. గాయపడిన ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ట్రంప్ క్షేమంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

Advertisement

పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ట్రంప్ ఆ స్టేజీపైనే కిందపడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణగా చేరారు. వేదిక పైనుంచి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే స్టేజి పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చికిత్స అనంతరం ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×