E-Paper
Advertisement

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి
Advertisement

Earthquake: భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా దేశాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. బహుల అంతస్థుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 46 వేల మంది దుర్మరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు భయటపడుతున్నాయి.

అయితే ప్రమాదం సంభవించి 296 గంటలు గడవడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టర్కీలో సహాయక చర్యలను ఈరోజుతో నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ వెల్లడించారు.

Advertisement

ఇక ఇప్పటి వరకు భూకంపం దెబ్బకు మూడు లక్షలకు పైగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు రోగాల వ్యాప్తి క్రమంగా పెరుగతోంది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×