E-Paper
Advertisement

Trump Warning to Iran: హర్మూజ్‌ జలసంధి ఇష్యూ.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు

Trump Warning to Iran: హర్మూజ్‌ జలసంధి ఇష్యూ.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు
Advertisement

Trump Warning to Iran: ఇరాన్ అల్టిమేటం ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తిరిగి తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను నాశనం చేస్తామని బెదిరింపులకు దిగారు. వార్నింగ్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తమపై దాడులు చేస్తే అమెరికా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు

Advertisement

ఇరాన్-అమెరికాల మధ్య వార్ తీవ్రరూపం దాల్చింది. హర్మూజ్‌ జలసంధి వద్ద ఆయిల్ నౌకలు వేల సంఖ్యలో నిలిచిపోయాయి. ఫలితంగా ఆసియా, ఐరోపా దేశాల్లో తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. చివరకు చేసేది ఏమీ లేక ట్రంప్‌పై మద్దతుదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు ట్రంప్.

ఈ క్షణం నుండి 48 గంటల్లో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ప్రస్తావించారు. అంతేకాదు ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని అందులోని మొదటి పాయింట్. ఈ విషయంలో ఇరాన్ మొండికేస్తే ఆదేశంలో విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందన్నారు.

Advertisement

హర్మూజ్‌ జలసంధి తెరవకుంటే విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా

వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని, అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసి వేసింది. దీంతో అక్కడ వేలాది షిప్ లు ఆగిపోయాయి. ఫలితంగా ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందని ట్రంప్ సూచన చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరిక రావడంతో ఏం జరుగుతుందోనన్న టెక్షన్ వివిధ దేశాలను వెంటాడుతోంది. తమ దేశ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఏ మాత్రం దాడి జరిగినా ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని ఇటీవల ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది.

ALSO READ: ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్,  వాటిపై ప్రధానంగా చర్చ

ఇరాన్ మీడియా ప్రకారం.. ఆదేశ ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటే.. ఈ ప్రాంతంలోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ఓ ప్రకటన చేశారు. యుద్ధం ఆగాలంటే మూడు షరతులను పెట్టారు.  దానిపై ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో 48 గంటల తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×