E-Paper
Advertisement

ఎట్టకేలకు ఎండ్ కార్డు పడినట్టే.. ఇరాన్ సిద్దమైందన్న ట్రంప్, రేపో మాపో ఒప్పందంపై సంతకాలు

ఎట్టకేలకు ఎండ్ కార్డు పడినట్టే..  ఇరాన్ సిద్దమైందన్న ట్రంప్, రేపో మాపో ఒప్పందంపై సంతకాలు
Advertisement

Trump: పశ్చిమాసియాలో ఘర్షణను ముగించాలని ఇరాన్ డిసైడ్ అయ్యిందా?  హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అంగీకరించిందా?  ఈ నేపథ్యంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా ఎండ్ కార్డు

Advertisement

శనివారం రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరాన్‌పై అమెరికాకు మరోసారి భీకర దాడులకు సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం రాత్రి దాడులు తప్పవంటూ ప్రచారం సాగుతోంది. రాత్రి ఇరాన్‌తో ఒప్పందం కుదిరేందుకు అవకాశముందని ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించినట్టు ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు.

Advertisement

ఇరాన్ సిద్దమైందన్న ట్రంప్.. రేపో మాపో ఒప్పందంపై సంతకాలు

యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయని, హర్మూజ్‌ జలసంధిని తిరిగి ఓపెన్ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరిన తర్వాత యురేనియం నిల్వలను నిర్వీర్యం చేసేదానిపై చర్చలు జరపనున్నట్లు ప్రస్తావించింది.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన సుమారు 440 కిలోల ఉన్నట్లు ఓ అంచనా. అణ్వస్త్ర తయారీకి అవసరమైన 90 శాతం శుద్ధి చేసుకోవచ్చని నిపుణుల మాట. అంతేకాదు వాటితో 10 కిపైగా అణు వార్‌హెడ్లను తయారు చేయవచ్చని చెబుతున్నారు. శుద్ధి చేసిన యురేనియం ద్వారా బాంబు తయారీకి వినియోగించవచ్చు.

ALSO READ: వైట్‌హౌస్ సమీపంలో కలకలం.. 30 రౌండ్లు కాల్పులా? రంగంలోకి సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, మూడోసారి

ఈ నిల్వల్లో అధిక భాగం ఇస్ఫహాన్ అణు కేంద్రంలో భూగర్భంలో ఉంచినట్టు భావిస్తున్నారు. ఈ అంశం చర్చలలో ప్రతిష్టంభనగా మారింది. యురేనియం నిల్వలపై ఎలాంటి కట్టుబాటునైనా తదుపరి దశ చర్చల వరకు వాయిదా వేయాలని ఇరాన్ ప్రతినిధులు ఒత్తిడి చేసినట్లు సమాచారం. అలా చేయడంలో చర్చలు విఫలమైతే సైనిక చర్యలు తిరిగి ప్రారంభమవుతుందని హెచ్చరించినట్టు ప్రస్తావించింది.

ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా విదేశాలలో స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం ఉంటుందని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ పునర్నిర్మాణానికి సంబంధించిన నిధులలో అధిక భాగం అణు ఒప్పందం కుదిరిన తర్వాతే విడుదల చేయబడతాయిని తెలుస్తోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×