E-Paper
Advertisement

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్.. స్టాక్ మార్కెట్ భారీ పతనం

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్.. స్టాక్ మార్కెట్ భారీ పతనం
Advertisement

America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రం కానుంది. గడిచిన రెండు మూడు రోజులుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ మొదలుకావచ్చనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్-ట్రంప్- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తనకు ముగిసిందని తేల్చేశారు. ఇకపై ఇరాన్‌తో వ్యవహరించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు. అంతా ముగిసిపోయిందని తాను అనుకుంటున్నానని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

టర్కీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు- ఇకపై వ్యవహారం వద్దు, వాళ్ళకు నాయకత్వం వహిస్తువారు రోగగ్రస్తులేనని తేల్చేశారు. వాళ్ళు దుర్మార్గులు, హింసాత్మకమైన వ్యక్తులని వెల్లడించారు. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలుంటే దాన్ని ప్రయోగిస్తారన్నారు. నన్ను అడిగితే అంతా ముగిసిపోయిందన్నారు. ఇరాన్‌ ప్రజలను దుర్మార్గులతో పోల్చారు అమెరికా అధ్యక్షుడు. వారితో డీల్ గురించి మాట్లాడడమంటే సమయం వృథా చేయడమేనన్నారు.

ఇరానీయులను అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం కలిగినవాళ్లంతా విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపిందన్నారు. హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని ఆరోపించారు.

Advertisement

ALSO READ: గదిలో భార్యను చంపి.. బాత్రూంలో డ్రామా ఆడిన టెక్కీ అవినాశ్‌ అరెస్ట్

ట్రంప్ వ్యాఖ్యలపై భారీగా పతనమైన బాంబే స్టాక్ మార్కెట్-వాళ్లలో ఏదో సమస్య ఉందన్నారు. నిజం చెప్పాలంటే వారితో నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదన్నారు. అనుసంధానకర్తలు మాట్లాడాలనుకుంటే మాట్లాడనిస్తానని, నాకు అలా అనిపించలేదన్నారు. ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన బాంబే స్టాక్ మార్కెట్‌ని ఓ కుదుపు కుదిపేసింది.

నిమిషాల వ్యవధిలో రూ. 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.  మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్  1677 పాయింట్లు, నిఫ్టీ 516 పాయింట్లు పతనమయ్యాయి.  బ్యాకింగ్, ఐటీ, ఫార్మా ఆటో ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాల షేర్లు కుప్పకూలాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×