E-Paper
Advertisement

Trump Angry: ఐరోపా దేశాలపై ట్రంప్ మండిపాటు.. ఆయిల్ మా దగ్గర కొంటారా? హర్మూజ్‌కు వెళ్తారా?

Trump Angry: ఐరోపా దేశాలపై ట్రంప్ మండిపాటు.. ఆయిల్ మా దగ్గర కొంటారా? హర్మూజ్‌కు వెళ్తారా?
Advertisement

Trump Angry: ఇరాన్ యుద్ధం ఇంకా సాగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లో అసహనం మొదలైందా? అమెరికాకు ఐరోపా దేశాలు ఒకొక్కటిగా దూరం జరగడం మొదలుపెట్టాయా? యుద్దంలో సహాయం చేయాలని పలుమార్లు కోరినా ఆయా దేశాలు పట్టించుకోలేదా? ఈ క్రమంలో ఆయా దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఐరోపా దేశాలపై మరోసారి ట్రంప్ మండిపాటు

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండో నెలకు చేరింది. ఇరాన్‌తో యుద్ధం మొదటివారంతో ముగుస్తుందని తొలుత అమెరికా భావించింది. రెండువారం నుంచి ఇరాన్‌పై యుద్ధానికి విరామం ఇచ్చే ప్రయత్నం చేశారు. తొలుత 48 గంటల పాటు విరామం ఇచ్చిన అమెరికా, దాన్ని ఏకంగా 10 రోజులకు పెంచేసింది. ట్రంప్ మాటలను మొదట్లో ఇరాన్ ఖండించింది. ఆయన మాటలను ఆ తర్వాత పట్టించుకోలేదు.

ట్రంప్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇరాన్ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చమురు కొరతతో ఇబ్బందిపడుతున్న ఐరోపా, ఆసియా దేశాలు ఈ యుద్ధంలో సహకరించాలని ట్రంప్ పిలుపు నిచ్చారు. అందుకు పలు దేశాలు నిరాకరించాయి. ఈ క్రమంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆయిల్ మా దగ్గర కొంటారా? హర్మూజ్‌కు వెళ్తారా?

హోర్మూజ్ జలసంధి కారణంగా చమురు కొరత ఎదుర్కొంటున్న దేశాలకు మరోసారి సూచన చేశారు ట్రంప్. అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయాలని తేల్చి చెప్పారు. తమ వద్ద ఆయిల్ పుష్కలంగా ఉందన్నారు. ఆలస్యమైనా ధైర్యం చేసుకుని హోర్మూజ్ జలసంధికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకోవాలన్నారు. మీకోసం తాము పోరాటం చేస్తున్నామని, మాకు అండగా మీరు రావలేదన్నారు.

మీకు సహాయం చేయడానికి అమెరికా ఇకపై మీతో రాదని తేల్చేశారు. ఇరాన్ దాదాపుగా నాశనమైందని, వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోవాలంటూ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ఇదిలా ఉండగా యూరప్‌ మీదుగా వెళ్తున్న కొన్ని అమెరికా సైనిక విమానాలు సిసిలీలోని సిగోనెల్లా స్థావరంలో దిగడానికి ఇటలీ అనుమతి కోరింది అగ్రరాజ్యం.

ALSO READ: ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ.. నెల రోజుల్లోనే రూ.2.63 లక్షల కోట్లు హాంఫట్!

అమెరికా చేసిన అభ్యర్థనను ఇటలీ తిరస్కరించిందని ప్రభుత్వ టీవీ ఛానెల్ మంగళవారం తెలిపింది. ఈ అభ్యర్థన లాజిస్టికల్ వినియోగాన్ని మించిపోయిందని తెలిపింది. పార్లమెంటరీ ఆమోదానికి తగినంత సమయం లేకపోవడంతో అనుమతి ఇవ్వలేమని ఇటలీ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

యుద్ధం కోసం తమ స్థావరాలను, గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి స్పెయిన్ ఇప్పటికే అమెరికాను నిరాకరించింది. ఇరాన్‌పై యుద్దం చట్టవిరుద్దమని ఆదేశం తేల్చింది కూడా. సైనిక సామాగ్రితో ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను ఫ్రెంచ్ భూభాగం మీదుగా వెళ్లడానికి ఆ దేశం అనుమతి ఇవ్వలేదు. ఈక్రమంలో ఫ్రాన్స్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆ దేశం అస్సలు సహాయ పడలేదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రంప్ ట్వీట్‌తో తాము ఆశ్చర్యపోయామని ఫ్రాన్స్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. యుద్ధం మొదలైన రోజు నుంచీ పారిస్ తన వైఖరిని మార్చుకోలేదని తెలియజేసింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×