E-Paper
Advertisement

Trump-Biden Debate: నేడే ట్రంప్- బైడెన్ బిగ్ డిబేట్.. నాలుగేళ్లలో తొలిసారి..!

Trump-Biden Debate: నేడే ట్రంప్- బైడెన్ బిగ్ డిబేట్.. నాలుగేళ్లలో తొలిసారి..!
Advertisement

Trump-Biden Debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన రాజకీయ ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇరువురు కీలక నేతలు గురువారం జరిగే ముఖాముఖి డిబేట్‌లో పాల్గొంటారు. గత ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ పరస్పరం పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా మళ్లీ వారిద్దరూ పోటీలో నిల్చున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు అభ్యర్థుల మధ్య ఆనవాయితీగా జరిగే ఈ డిబేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ ఇరువురు నేతల ప్రచారం తారాస్థాయికి చేరింది. అయితే అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్..నాలుగేళ్లలో తొలిసారి ముఖాముఖి తలపడనున్నారు.

Advertisement

బైడెన్, ట్రంప్ డిబేట్‌లో ఎలాంటి అంశాలపై చర్చిస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమం అట్లాంటాలో దాదాపు 90 నిమిషాల పాటు జరగనుంది. ఇందులో చర్చించే అంశాలను టీవీతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రసారం కానుంది. అయితే ఈ ప్రోగ్రాంను ప్రతీ 10 మంది అమెరికన్లలో ఆరుగురు చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడించింది.

Also Read: China expels Ex defence ministers: చైనా కీలక నిర్ణయం, మాజీ రక్షణశాఖ మంత్రులపై బహిష్కరణ వేటు

Advertisement

డెమోక్రటిక్ నేత బైడెన్ విజయానికి ఈ డిబేట్ చాలా ముఖ్యమని 47శాతానికి పైగా అమెరికన్లు భావిస్తుండగా..అంతకంటే ముఖ్యం ట్రంప్‌నకే అని ప్రతీ 10 మందిలో నలుగురు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఈ డిబేట్ ఇద్దరికీ ముఖ్యమని 10 మందిలో ముగ్గురు భావిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×