E-Paper
Advertisement

తూటాలు పేలుతాయంటూ.. కాల్పులకు ముందు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్!

తూటాలు పేలుతాయంటూ..  కాల్పులకు ముందు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్!
Advertisement

Karoline Leavitt shots fired comment viral: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జ‌రిగిన‌ హత్యాయత్నం ఘ‌ట‌న‌ ఒక్కసారిగా పెను సంచలనం రేపింది. వైట్‌హౌస్‌లో జరిగిన కరస్పాండెంట్స్ విందు కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రమాదం నుండి ట్రంప్, ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తృటిలో తప్పించుకున్నారు. డిన్నర్ మీటింగ్ అత్యంత ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు (సిక్రెట్ సర్వీస్) అధ్యక్షుడిని, ఇతర కీలక నేతలను అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అయితే, ఈ కాల్పుల ఘటనకు కొద్ది నిమిషాల ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “ఈ రాత్రి ఈ గదిలో కొన్ని తూటాలు పేలుతాయి (Shots fired).. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి.” అని వ్యాఖ్యానించారు. ఆమె ఈ మాటలు అన్న కొద్దిసేపటికే నిజంగానే కాల్పులు చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. లీవిట్ వాడిన ‘Shots fired’ అనే పదం ఇప్పుడు అనేక కుట్ర కోణాలకు ఆస్కారం కల్పిస్తోంది.కరోలిన్ లీవిట్ ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగానే చేశారా లేదా ఆమెకు ఈ దాడుల గురించి ముందే తెలుసా అన్న అనుమానాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రసంగం గురించి ఆమె మరింత వివరిస్తూ.. ఇది కచ్చితంగా క్లాసిక్ డొనాల్డ్ ట్రంప్ శైలిలో, చాలా వినోదాత్మకంగా, సరదాగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రసంగం తయారీలో తన పాత్ర లేదని, ట్రంప్ స్వయంగా తన కలంతో ఈ ప్రసంగాన్ని రాసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే, రాజకీయ, దౌత్యపరమైన భాషలో ‘Shots Fired’ అనే పదాన్ని ప్రత్యర్థులపై విమర్శలు సంధించడం లేదా ఘాటైన వ్యాఖ్యలు చేయడం అనే అర్థంలో ఎక్కువగా వాడుతుంటారు. ట్రంప్ తన ప్రసంగంలో ప్రత్యర్థులను ఎండగడతారని చెప్పే క్రమంలో ఆమె ఈ పదాన్ని వాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, అనుకోకుండా అదే సమయంలో వాస్తవంగా కాల్పులు జరగడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

Advertisement

భద్రతా సంస్థలు, రాజకీయ నిపుణులు ఈ వ్యాఖ్యలను, కాల్పుల ఘటన జరిగిన సమయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది కేవలం మాటల ప్రయోగమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా రాజకీయాల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

Read Also: సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×