E-Paper
Advertisement

UK Mass Stabbings: బ్రిటన్​లో ఉన్మాది దాడి, ముగ్గురు చిన్నారులు మృతి, పలువురి పరిస్థితి విషమం

UK Mass Stabbings: బ్రిటన్​లో ఉన్మాది దాడి, ముగ్గురు చిన్నారులు మృతి, పలువురి పరిస్థితి విషమం
Advertisement

UK Mass Stabbings: నార్త్-వెస్ట్ ఇంగ్లాండ్ సౌత్ పోర్టులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కమ్యూనిటీ సెంటర్‌‌లో గుర్తుతెలియని వ్యక్తి పలువురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అంతే కాకుండా 9 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.వేల్స్‌కు చెందిన 17 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం హార్ట్ స్ట్రీట్‌లోని టైన్ హార్ట్ సెంటర్‌లో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు హాజరైన వారిపై ఉన్మాది దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ కాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాతో పాటు ప్రధాని కీయర్ స్టార్మర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×