E-Paper
Advertisement

థాయిలాండ్ షాకింగ్ డెసిషన్.. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా రద్దు!

థాయిలాండ్ షాకింగ్ డెసిషన్.. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా రద్దు!
Advertisement

Thailand Visa: భారతీయ పర్యాటకులకు థాయిలాండ్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత ఏడాది కాలంగా పర్యాటక రంగాన్ని పుంజుకునేలా చేయడానికి అమలు చేసిన 60 రోజుల ఉచిత వీసా సదుపాయాన్ని థాయిలాండ్ క్యాబినెట్ అధికారికంగా రద్దు చేసింది. ఈ తాజా నిబంధనల ప్రకారం, భారతీయులు మళ్లీ పాత పద్ధతిలోనే వీసా ఆన్ అరైవల్ కేటగిరీ కిందకు మారారు. దీనివల్ల భారతీయ పర్యాటకులు థాయిలాండ్‌లో గరిష్టంగా 15 రోజులు మాత్రమే బస చేయడానికి అనుమతి ఉంటుంది, అలాగే విమానాశ్రయంలో 2,000 థాయ్ భట్ (సుమారు రూ.4,800) వీసా ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Read also-This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి 19 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..

Advertisement

ఉచిత వీసాను రద్దు చేయడానికి థాయిలాండ్ ప్రభుత్వం ప్రధానంగా జాతీయ భద్రత కారణాలను చూపిస్తోంది. ఎక్కువ రోజుల బస సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు విదేశీయులు డ్రగ్స్ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్స్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. అలాగే టూరిస్ట్ వీసాలపై వచ్చి ఎలాంటి పర్మిట్లు లేకుండా అక్రమంగా వ్యాపారాలు నిర్వహించడం, లాంగ్-స్టే సదుపాయాన్ని రెసిడెన్సీ పర్మిట్‌లా వాడుకుంటూ స్థానిక నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతోనే థాయిలాండ్ హోంమంత్రిత్వ శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Read also-సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

Advertisement

ఈ కొత్త నిబంధనల వల్ల థాయిలాండ్‌లో ఎక్కువ రోజులు గడపాలనుకునే స్లో ట్రావెలర్స్, రిమోట్ వర్కర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకునే వారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇకపై భారతీయులు 15 రోజుల లోపు ట్రిప్ కోసం థాయిలాండ్ వెళ్లాలంటే కనీసం 6 నెలల వాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్, కన్ఫర్మ్డ్ రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలతో పాటు ఖర్చుల కోసం కనీసం 10,000 థాయ్ భట్ నగదును వెంట ఉంచుకోవాలి. ఒకవేళ 15 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, ప్రయాణానికి ముందే ఆన్‌లైన్ ద్వారా ఇ-వీసా (e-Visa) లేదా సాధారణ టూరిస్ట్ వీసాకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×