E-Paper
Advertisement

Texas Shooting: టెక్సాస్‌లో కాల్పుల వెనుక.. ఇరాన్‌తో లింక్‌‌పై ఆరా, నిందితుడ్ని కాల్చిన చంపిన పోలీసులు

Texas Shooting: టెక్సాస్‌లో కాల్పుల వెనుక.. ఇరాన్‌తో లింక్‌‌పై ఆరా, నిందితుడ్ని కాల్చిన చంపిన పోలీసులు
Advertisement

Texas Shooting: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సిటీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో మరో 14 మంది వరకు గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఒక్కసారి గా అమెరికా ఉలిక్కిపడింది. దీని వెనుక ఇరాన్‌ హస్తం ఉందేమోనని భావిస్తోంది. ఆ దిశగా ఎఫ్‌బీఐ వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.

టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇరాన్‌తో లింక్‌‌పై ఆరా

Advertisement

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ బార్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది వరకు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేవలం ఓ నిమిషంలోపు నిందితులను హతమార్చారు.

ఆస్టిన్ సిటీలో వినోద ప్రాంతంలోని బుఫోర్డ్స్ బీర్ గార్డెన్ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడి కాలమాన ప్రకారం మార్చి ఒకటి, ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. బార్ మూసివేస్తున్న సమయంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అకస్మాత్తుగా వచ్చిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు.

Advertisement

నిందితుడ్ని కాల్చిన చంపిన పోలీసులు

పోలీసుల కాల్పుల్లో మరణించిన ముగ్గురిలో ఒక్కడే నిందితుడని పోలీసులు చెప్పారు. గాయపడిన 14 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధం ఏదైనా ఉందా అనే కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు దస్తులపై ఇరాన్ జెండా డిజైన్, అల్లాహ్ ఆస్తి అనే పదాలు రాసున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి ప్రారంభించిన ఒక్కరోజులో కాల్పులు జరగడంతో ఉగ్రవాద చర్యగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

ALSO READ: ఒక్క‌ దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను మ‌ట్టుబెట్టాం.. ట్రంప్ కీల‌క‌ ప్రకటన

ఘటన సమయంలో నిందితుడు పిస్టల్, రైఫిల్ రెండింటినీ ఉపయోగించాడని తెలుస్తోంది. నిందితుడు కారు పార్క్ చేసి రైఫిల్ తో బయటకు వచ్చి వీధిలో నడుస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కూడలికి వద్దకు వెళ్లి అక్కడా కాల్పులు జరిపాడని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి 53 ఏళ్లు ఉంటాయని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×