E-Paper
Advertisement

South Africa: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల ఆలయం.. శిథిలాల కింద అనేక మంది!

South Africa: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల ఆలయం.. శిథిలాల కింద అనేక మంది!
Advertisement

South Africa: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలింది. అయితే ఇస్కోన్ (ISKCON) సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ఆలయం నాలుగు అంతస్తుల ఎత్తులో ఉంది.

నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి సహా మరో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా నిర్మాణ కార్మికులేనని భావిస్తున్నారు.

Advertisement

అయితే కూలిపోయిన ఈ నిర్మాణాన్ని స్థానికంగా న్యూ అహోబిలం ఆలయంగా పిలుస్తున్నారు. భవనం కూలిపోగానే పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అత్యవసర సేవల బృందాలు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ప్రమాద సమయంలో శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. దీనితో, వారిని సురక్షితంగా బయటకు తీయడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగించారు, ప్రాణాలతో ఉన్నవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

ఈ ఘోర ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయా, లేక భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయం.. సెల్ టవర్ ఎక్కి హల్‌చల్!

ఆలయాన్ని నిర్మిస్తున్న సంస్థ ప్రతినిధులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు స్థానిక సంస్థలు, ఆలయ కమిటీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×