E-Paper
Advertisement

మెక్సికోలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఎలా జరిగింది?

మెక్సికోలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఎలా జరిగింది?
Advertisement

Mexico: మెక్సికోలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాల్పుల ఘటన వెనుక అసలేం జరిగింది? నిందితుల కోసం అక్కడి పోలీసులు గాలింపు చేపట్టారు.

తీవ్ర కలకలం రేపిన మెక్సికోలో కాల్పుల ఘటన

Advertisement

మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలోని టెహుయిట్జింగో సిటీలో తెల్లవారుజామున కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక మైనర్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు.

టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ వ్యక్తులు వీరిని లక్ష్యంగా చేసుకున్నారని స్థానిక రాష్ట్ర ప్రభుత్వ తెలిపింది. ఈ హత్యలకు పాల్పడిన వారికి శిక్ష నుండి మినహాయింపు ఉండదని హామీ ఇచ్చింది. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి నిఘా బృందాలు పని చేస్తున్నాయని పేర్కొంది.

Advertisement

స్పాట్‌లో 10 మంది మృతి, ఎలా జరిగింది?

దాడికి బాధ్యులైన వారిని పట్టుకోవడానికి రాష్ట్ర-కేంద్ర అధికారులు సమన్వయంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపింది. నెల రోజుల్లో ఫిఫా ప్రపంచ కప్‌కు మెక్సికో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ కాల్పుల ఘటనపై కలకలం రేపుతోంది. దాదాపు 11,300 మంది జనాభా కలిగిన టెహుయిట్జింగో పట్టణం, దేశ రాజధాని మెక్సికో సిటీకి సుమారు 208 కిలోమీటర్లు దూరంలో ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×