E-Paper
Advertisement

Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త చట్టం!

Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త చట్టం!
Advertisement

Taliban Law: అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం వివాదస్పద చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలపై గృహహింసను ప్రోత్సహించేలా.. చిన్నారులపై శారీరక హింసను సమర్థించేలా 90 పేజీల క్రిమినల్ కోడ్ ను ప్రవేశపెట్టింది. దీనిపై అఫ్గాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా సంతకం చేసి మరి ఆమోదించారు. ప్రస్తుతం ఈ కొత్త చట్టం అఫ్గాన్ మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రశ్నలు లెవనెత్తుతోంది.

చట్టం ఏం చెబుతుందంటే?

తాలిబన్లు ప్రవేశపెట్టిన కొత్త శిక్షాస్మృతి ప్రకారం.. ఎముకలు విరగడం లేదా గాయాలు కనిపించనంత వరకూ భర్తలు తమ భార్యలు, పిల్లలను శరీరకంగా హింసించుకోవచ్చు. ఒకవేళ భార్య శరీరంపై గాయాలు కనిపించేలా భర్త దాడి చేస్తే అతడికి 15 రోజుల జైలు శిక్ష మాత్రమే ఈ చట్టం అనుమతిస్తోంది. అది కూడా భర్త వేధింపులను స్పష్టమైన సాక్ష్యాధారాలతో భార్య కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుందని ఈ క్రిమినల్ కోడ్ చెబుతోంది.

3 నెలల వరకూ జైలు శిక్ష

Advertisement

స్త్రీ తన ఒంటిపై గాయాలను న్యాయమూర్తికి చూపించాలని తాలిబన్ చట్టం సూచిస్తోంది. దానిని జడ్జి నిర్ధారించిన తర్వాతనే భర్తపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొంది. మరోవైపు వివాహిత స్త్రీ తన భర్త అనుమతి లేకుండా వారి తరపు బంధువులను అనుమతిస్తే  3 నెలల వరకూ జైలు శిక్ష విధించేలా చట్టం ప్రోత్సహిస్తోంది. కాగా, కొత్త చట్టంలోని ఆర్టికల్ – 9 ప్రకారం అఫ్గాన్ సమాజాన్ని ఉలమా (మత పండితులు), అష్రఫ్ (ఉన్నత వార్గం), మధ్య తరగతి, దిగువ తరగతి అనే నాలుగు వర్గాలుగా విభజించారు.

శిక్ష నుంచి మినహాయింపు

ఇస్లామిక్ పండితులు నేరం చేస్తే అతడ్ని శిక్షించడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. బదులుగా నేరం చేయకుండా సున్నితంగా సూచనలు చేయాలని స్పష్టం చేస్తోంది. అలాగే ఉన్నత వర్గానికి చెందిన వారు తప్పు చేస్తే కోర్టు సమన్లు మాత్రమే ఇవ్వాలని, మధ్యతరగతి – దిగువ తరగతి వారు నేరం చేస్తే జైలు శిక్ష విధించవచ్చని తాలిబన్ చట్టం చెబుతోంది. ఒకవేళ తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లో శారీరక శిక్షలను కోర్టులు కాకుండా ఇస్లామిక్ మతాధికారులు విధిస్తారని కొత్త చట్టం పేర్కొంది.

Advertisement

Also Read: Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!

స్త్రీలపై డజన్లకొద్ది ఆంక్షలు

అయితే తాలిబన్ల కొత్త చట్టం మహిళల స్వేచ్చను మరింతగా అణిచివేస్తుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అఫ్గాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్లు అనేక ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా, ఉపాధి, క్రీడలు, ఉద్యోగాలు, దుస్తులు ఇలా ప్రతీ అంశంలోనూ ఆంక్షలు విధిస్తూ డజన్ల కొద్ది ఆదేశాలు ఇచ్చారు. తాజాగా కొత్త చట్టం తీసుకొచ్చి ఏకంగా మహిళపై దాడులను పరోక్షంగా ప్రోత్సహించడం పట్ల అక్కడి మహిళలల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఈ అంశంలో కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని అఫ్గాన్ స్త్రీలు కోరుకుంటున్నారు.

Also Read: Viral Video: పబ్లిక్ మీటింగ్.. దేశాధ్యక్షుడిపై వాంతు చేసుకున్న వృద్ధుడు.. అందరూ షాక్!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×