E-Paper
Advertisement

Pakistan: కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan:  కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం
Advertisement

Pakistan: పాకిస్థాన్‌లో ముష్కరులు తెగబడ్డారు. పెషావర్‌లోని ఆదేశ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఈ ఉదయం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు అక్కడి పోలీసు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రిరిస్టులు-పాక్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దళాలు ఉండొచ్చని అంటున్నారు.

కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్

Advertisement

సోమవారం ఉదయం పెషావర్‌లోని పాకిస్తాన్ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. ఆ ఆఫీసును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని స్థానిక పోలీసులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. మొదటి ఆత్మాహుతి దాడి కాన్స్టాబులరీ ప్రధాన ద్వారంపై జరిగింది.

ఆ దాడి తర్వాత మరొకరు ఆవరణలోకి ప్రవేశించినట్టు ఓ సీనియర్ అధికారిని తెలిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం, స్థానికులు పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అప్పటికే కొందరు ఉగ్రవాదులు ప్రధాన కార్యాలయం లోపల వెళ్లినట్టు అనుమాని స్తున్నారు. ప్రాథమిక నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. రెండు పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.

Advertisement

పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి

ఒకటి ప్రధాన గేటు వద్ద కాగా, మరొకటి సమీపంలోని మోటార్ సైకిల్ స్టాండ్ వద్ద ఐఈడీ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో నలుగురు గాయపడ్డారు. వారిని త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన సంఘటనగా పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో క్వెట్టాలోని పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల కారు బాంబు పేలింది. ఈ ఘటనలో కనీసం పది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

ALSO READ: బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్

సెప్టెంబర్ 3న క్వెట్టాలో ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది. అందులో 11 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.  బలూచిస్తాన్‌లో చాలా కాలంగా అక్కడి తిరుగుబాటుదారులతో పాకిస్తాన్ దళాలు పోరాడుతున్నాయి. గతేడాది 782 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఓ రైలుని హైజాక్ చేసి సైనికులను హతమార్చింది. జనవరి నుండి వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 430 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించినట్టు అక్కడి నివేదికలు చెబుతున్నాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×