E-Paper
Advertisement

Samoa Earthquake: సమోవాలో భారీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం

Samoa Earthquake: సమోవాలో భారీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం
Advertisement

Samoa Earthquake: పసిఫిక్ ప్రాంతంలో ఉన్న సమోవా ద్వీప సమీపంలో.. శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.6 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అధికారులు వెల్లడించారు.

భూకంప కేంద్రం – సమోవా వాయువ్యానికి 400 కిలోమీటర్ల దూరంలో
సమోవా వాయువ్య దిశలో 400 కిలో మీటర్ల దూరంలో.. 314 కిలో మీటర్ల భూకంప కేంద్రం ఉందని ప్రకటించారు.

Advertisement

ప్రజల పరుగులు.. భయాందోళనలు
భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత తక్కువ ప్రాంతాల్లో కూడా వాహనాలు ఊగిపోవడం, వస్తువులు కింద పడిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి.

సునామీ హెచ్చరికలు లేవు
అయితే, ఈ భూకంపం వల్ల సునామీ ఉద్భవించే ప్రమాదం లేదని.. అధికారులు స్పష్టం చేశారు. భూకంప కేంద్రం సముద్రపు లోతుల్లో ఉన్నప్పటికీ, తక్కువ ప్రభావం కలిగే ఉండటం వల్ల.. పెద్ద ఎత్తున అలల పెరుగుదల కనిపించలేదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయితే, సముద్రతీర ప్రాంతాల ప్రజలు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తీవ్ర ఆస్తి నష్టం

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు.. ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. కొన్ని భవనాల్లో గోడలు చీలినట్టు, కొన్నిచోట్ల ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమైనట్టు.. స్థానిక మీడియా తెలిపింది. అయితే ప్రాణనష్టం జరగలేదన్న విషయంపై.. అధికారిక స్పష్టత ఇంకా రాలేదు.

Also Read: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు

రెస్క్యూ బృందాలు రంగంలోకి
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో.. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీమ్‌లు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. అత్యవసర వైద్య సాయంతో పాటు.. తాత్కాలిక నివాసాల ఏర్పాట్లు ప్రారంభించారు. విద్యుత్, నీటి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన కొన్ని ప్రాంతాల్లో.. పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలయ్యాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×