E-Paper
Advertisement

Srilanka Floods: శ్రీలంకను వణికిస్తున్న భారీ వర్షాలు.. ఒక్కరోజే 10మంది మృతి

Srilanka Floods: శ్రీలంకను వణికిస్తున్న భారీ వర్షాలు.. ఒక్కరోజే 10మంది మృతి
Advertisement

Srilanka Floods: శ్రీలంకను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి దేశమంతా అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు నీటమునగగా.. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దేశ రాజధాని కొలొంబోలో 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క రోజే 15మంది మృత్యువాత పడ్డారు. రతన్ పూర్ జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతి చెందగా..కొండచరియలు విరగడంతో మరో ముగ్గురు దుర్మరణం చెందారు. విపరీతమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడడంతో ఒక్కరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, వరదల ధాటికి మరో 15మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ విద్యార్థిని ఆచూకీ లభ్యం..

Advertisement

300 మిల్లీమీటర్ల వర్షం నమోదు..

దేశ రాజధాని కొలొంబోతోపాటు రతన్ పూర్ ప్రాంతాల్లో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ వరదల ధాటికి 4వేలకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 100కుపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే విధంగా రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల స్తంభాలు సైతం నేలమట్టం కావడంతో ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా పడవలతో కూడిన శ్రీలంక సైన్యం బృందాన్ని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాగా, వర్షాలు పడే ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×