E-Paper
Advertisement

కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!

కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!
Advertisement

Coffee Shop Fine: వినియోగదారుల హక్కులను కాలరాస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఒక ప్రముఖ కాఫీ షాప్‌నకు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన బరిస్టా ఎక్స్ ప్రెస్ కాఫీ షాప్ యాజమాన్యానికి ఏకంగా రూ. 4,00,000 భారీ జరిమానా విధిస్తూ శ్రీలంకలోని బండరవెలా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. తప్పు జరిగినట్లు స్వయంగా కాఫీ షాప్ యాజమాన్యం అంగీకరించడంతో ఈ మేరకు భారీ ఫైన్ విధించింది.

అసలేం జరిగిందంటే?

శ్రీలంకకు చెందిన ప్రముఖ కాఫీ బ్రాండ్ ‘బరిస్టా కాఫీ లంకా’.. బండరవెలా ప్రాంతంలో ‘బరిస్టా ఎక్స్ ప్రెస్’ పేరుతో కాఫీ షాప్ నడుపుతోంది. అయితే దీనిపై కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో వినియోగదారుల వ్యవహారాల అథారిటీ (CAA) అధికారులు కాఫీ షాపులో సోదాలు నిర్వహించారు. ఆర్డర్ చేసిన వస్తువుల బిల్లింగ్‌, బరువు, నాణ్యతలో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మెనూ కార్డులో ఉన్న ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం, ప్యాకేజ్డ్ వస్తువులపై ఎం.ఆర్.పీ కంటే అదనంగా ఛార్జ్ చేయడం, నాణ్యత లేని సర్వీస్ అందించడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చారు.

కస్టమర్లకు ఎక్స్‌పైరీ బిస్కెట్లు

Advertisement

అంతేకాకుండా సరైన లేబుల్స్ లేకుండానే బిస్కెట్ ప్యాకెట్లను విక్రయానికి పెట్టినట్లు ఈ సోదాల్లో బయటపటింది. ఎక్స్ పైరీ డేట్ దాటిన బిస్కెట్లను కస్టమర్లకు విక్రయించడాన్ని గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను పానియాల తయారీలో వాడటాన్ని ప్రత్యక్షంగా చూశారు. దీనిపై నిలదీయగా.. కాఫీ షాపు నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. తమను తప్పుదోవ పట్టించే విధంగా వారు నడుచుకున్నట్లు కోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లారు.

Also Read: Jio Rs 195 vs Rs 200 Plan: రూ.5 తేడాతో డబుల్ డేటా.. యూట్యూబ్ ప్రీమియం, 15 ఓటీటీలు ఉచితం!

కోర్టు తీవ్ర ఆగ్రహం

Advertisement

కాఫీ షాపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై బండరవెలా మెజిస్ట్రేట్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాఫీ షాపుకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు లభించడంతో మీ సమాధానం ఏంటని బరిస్టా యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీంతో సదరు నిర్వాహకులు నీళ్లు నమలడంతో పాటు తప్పు జరిగినట్లు స్వయంగా అంగీకరించారు. దీంతో కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడినందుకు గానూ కాఫీ షాపునకు రూ.4 లక్షల భారీ జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. మరోమారు ఇలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు వినియోగదారులు సైతం ఇలాంటి కాఫీ షాపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.

Also Read: Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×