E-Paper
Advertisement

London: తుపుక్ తుపుక్ వ్యవహారం.. బుక్కైన ఇద్దరు భారతీయులు, ఏకంగా రూ.3.5 లక్షల ఫైన్‌

London: తుపుక్ తుపుక్ వ్యవహారం.. బుక్కైన ఇద్దరు భారతీయులు, ఏకంగా రూ.3.5 లక్షల ఫైన్‌
Advertisement

London: విదేశాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు భారతీయలు జాగ్రత్తగా ఉండాలి. ఇండియాలో మాదిరిగా వ్యవహరిస్తే అడ్డంగా బుక్కవుతారు. అందుకు ఎగ్జాంఫుల్ పైన కనిపిస్తున్న ఇద్దరు భారతీయులు. వారు చేసిన పనికి అక్కడి న్యాయస్థానం భారీగా జరిమానా విధించింది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా? ఒక్కసారి ఈ స్టోరీలోకి వెళొద్దాం.

రోడ్డుపై ఉమ్మినందుకు రూ.3.5 లక్షల ఫైన్‌

Advertisement

దక్షిణాసియా దేశాల్లో పాన్, గుట్కా, సిగరెట్ వ్యర్థాల వంటి చెత్తను బహిరంగంగా వేస్తుంటారు. కానీ పశ్చిమ దేశాల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రతను పాటించే విషయంలో చాలా కఠినమైన విధానాన్ని అవలంభిస్తారు అధికారు. ఇటీవల ఓ కేసులో వాయువ్య లండన్‌లో బహిరంగ ప్రాంతంలో పాన్ ఉమ్మివేసినందుకు బ్రెంట్ కౌన్సిల్ ఇద్దరు భారతీయులపై భారీ జరిమానాలు విధించింది.

లండన్ వీధుల్లో బహిరంగ ప్రాంతాల్లో పాన్‌ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు స్థానిక న్యాయస్థానం సుమారం రూ.3.48 లక్షలజరిమానా విధించింది. తొలుత కేవలం 100 పౌండ్ల జరిమానా విధించింది. దాన్ని చెల్లించకపోగా కోర్టుకు ఎస్కేప్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన బ్రెంట్‌ సిటీ అధికారులు భారీగా జరిమానా విధించారు.

Advertisement

లండన్ ఇద్దరు భారతీయులకు న్యాయస్థానం ఊహించని షాక్ 

లండన్‌ శివార్లలో బ్రెంట్‌ ప్రాంతం ఉంది. లండన్ సిటీలో అత్యంత చైతన్యవంతమైన ఏరియా కూడా. ఆ ప్రాంతంలో పౌరులు పాన్‌ ఉమ్మడం వల్ల రోడ్లు పాడవుతున్నాయి. అంతేకాదు ఆ మరకలను తొలగించడానికి సిటీ కౌన్సిల్‌కు భారంగా మారింది. అందుకోసం ఏటా 30,000 పౌండ్లు ఖర్చు చేస్తోంది. ఫలితంగా పన్ను భారాన్ని పౌరులపై మోపుతోంది.

దీంతో నగర కౌన్సిల్‌‌కి వ్యతిరేకంగా జీరో–టాలరెన్స్‌ పేరిట ప్రచారం మొదలుపెట్టారు. ఎడ్జ్‌వేర్‌ ప్రాంతానికి చెందిన అక్షిత్‌ భద్ర పటేల్‌ గతేడాది జూన్‌లో స్థానిక మెట్రో స్టేషన్‌ సమీపంలోని కింగ్స్‌బరీ రోడ్డుపై పాన్‌ ఉమ్మి వేశాడు. వెంటనే అలర్టయిన అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై నార్త్‌ వెస్ట్‌ లండన్‌ కోర్టు జరిమానా విధించింది. అయితే పటేల్‌ విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు న్యాయస్థానం విధించిన జరిమానా చెల్లించలేదు.

ALSO READ: మీడియా ముందుకు ఇజ్రాయెల్ పీఎం.. నేనే బతికే ఉన్నానంటూ వ్యాఖ్య

మరొక విషయానికి వద్దాం. రూయిస్లిప్‌ శివారు ప్రాంతానికి చెందిన హితేష్‌ పటేల్‌ కూడా అలాంటి పని చేశాడు. వెంబ్లీ హిల్‌ రోడ్డుపై పాన్‌ ఉమ్మి వేశాడు. అతడికి న్యాయస్థానం జరిమానా విధించింది. ఇతగాడు కోర్టుకి హాజరుకాలేదు. దీంతో జరిమానా పది రెట్లకు పెంచింది. లండన్‌లోని బ్రెంట్ సహా పలు ప్రాంతాల్లో పాన్‌ ఉమ్మివేయడంపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కౌన్సిల్‌ కఠిన నిర్ణయం తీసుకుంది.

వీధులను పాడుచేసే అస్సలు సహించబోమని, తాము విధించే ప్రతి జరిమానా ఒక స్పష్టమైన సందేశమని పేర్కొన్నారు. మా వీధులను పాడు చేస్తే కచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటామని, అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని కౌన్సిలర్‌ వ్యాఖ్యానించారు. మొత్తానికి తుపుక్ తుపుక్ వ్యవహారంపై లండన్ సిటీలో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×