E-Paper
Advertisement

Tragedy In China: తీవ్ర విషాదం, 4 పడవలు బోల్తా.. 84 మంది ?

Tragedy In China: తీవ్ర విషాదం,  4 పడవలు బోల్తా.. 84 మంది ?
Advertisement

Tragedy In China: చైనాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని  కియాంక్సి నగరంలో ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవలు ఒకే సారి బోల్తా పడటంతో 9 మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు.

ఈ ప్రమాదం లిగువాంగ్ నదిలో జరిగింది. అధికారులు నివేదిక ప్రకారం.. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలి కారణంగా 4 పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవల్లో మొత్తం 84 మంది పర్యాటకులు ఉండగా.. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న వారందరూ నీటిలో పడిపోయారు.

Advertisement

ఈ ప్రమాదం తర్వాత.. సమాచారం అందుకున్న  దాదాపు 500 మంది రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. 74 మంది పర్యాటకులను సిబ్బంది రక్షించారు. ఇంకొకరి ఆచూకి కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రాంతీయ అధికారులను ఆదేశించారు.

70 మంది పర్యాటకులను ఆసుపత్రికి తరలించారు:
ప్రమాదం తర్వాత.. స్థానిక అధికారులు 70 మంది పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అందరినీ ఆసుపత్రికి పంపించారు.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×