E-Paper
Advertisement

South Korea Stampede : సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 151 మందికి పైగా మృతి..

South Korea Stampede :  సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 151 మందికి పైగా మృతి..
Advertisement

South Korea Stampede : హాలోవీన్ వేడుక సందర్భంగా ఒక్కసారి వేళంమది రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో తొక్కిసలాటలో సుమారు 151 మందికి పైగా మృతి చెందారు. ఈ దుర్ఘటన దక్షిణ కొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది. హాలోవీన్‌ను ఉత్సాహంగా జరుపుకోవడానికి వేల మంది అక్కడికి వచ్చారు.. అప్పుడే ఓ సినీతార అక్కడికి వచ్చారనే వార్త అక్కడకి వచ్చిన వారికి తెలిసింది. దీంతో వారిని చూడడానికి అక్కడున్న వారు పరుగెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

తొక్కిసలాటలో చనిపోయిన అనేకమంది 20 ఏళ్ల లోపువారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఊపిరాడక.. గుండెపోటుతో చనిపోయిన వారే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. తొక్కిసలాట జరుగుతున్నప్పడు అక్కడి దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడి సందుల్లో కదలలేక ఇరుక్కొని చనిపోయిన దృష్యాల సోషల మీడియాలో వైరల్ అవుతున్నాయి. సియోల్‌లోని ఇటేవాన్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అక్కడ బార్లు, క్లబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు అధికంగా ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని ఆదేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సందర్శించారు. అయితే ఈ దుర్ఘటనకు గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×