E-Paper
Advertisement

North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు

North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు
Advertisement

North Korea: ఉత్తర కొరియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు కిమ్ జోంగ్ తన వారసత్వ పగ్గాలను కూతురికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నాయి. తెర వెనుక వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు తండ్రి కిమ్‌తోపాటు వరుసగా అన్ని కార్యక్రమాలకు కూతురు కిమ్‌ జుయే హాజరువుతున్నారు.

ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు

Advertisement

ఉత్తరకొరియా పేరు చెబితేచాలు ముందుగా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ పేరు వినబడుతోంది. ఆయన వయస్సు ప్రస్తుతానికి 42 ఏళ్లు. ఇంకా చాలా వయస్సు ఉండగానే ప్రపంచానికి తన కూతుర్ని పరిచయం చేస్తున్నాడు. కుటుంబ పాలనను నాలుగో తరానికి అప్పగించేందుకు ప్రయత్నాలను వేగవంతం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాబోయే నేతగా 13 ఏళ్ల కూతురు కిమ్‌ జుయేను ప్రకటించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి కొరియా పొరుగు దేశాలు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల కిందట దక్షిణకొరియా పార్లమెంట్‌ సభ్యులతో జరిగిన నేషనల్‌ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నతాధికారులు సమావేశంలో చర్చకు వచ్చింది.

Advertisement

కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు

ఏడాదిగా కిమ్‌ తన విదేశీ పర్యటనకు సైతం కూతుర్ని వెంట బెట్టుకెళ్తున్నారు. జనవరిలో న్యూఇయర్ రోజు పేరెంట్స్‌తో కలిసి రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కుమ్‌ సుసన్‌ ప్యాలెస్‌కు వెళ్లింది. అందులో తొలితరం పాలకులైన ముత్తాత కిమ్‌–2 సంగ్, తాత కిమ్‌ జొంగ్‌–2ల మాసోలియం ప్రత్యేకంగా సందర్శించింది.

కిమ్ ఆలోచన వెనుక రకరకాలుగా పొరుగుదేశాలు విశ్లేషిస్తున్నాయి. నాలుగేళ్ల కిందట అనగా 2022లో ప్రపంచానికి కిమ్‌ తన కూతుర్ని పరిచయం చేశాడు. ఆనాటి నుంచి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతోంది. ఉత్తర కొరియా పగ్గాలు ఆమెకు అప్పగించకపోవచ్చని తొలుత దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. మీడియాలో కిమ్‌ జు యే ప్రధానంగా కనిపిస్తుండటంతో మళ్లీ ఆయా వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.

ALSO READ:  పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం

కిమ్‌ వారసురాలు అయ్యే అవకాశం కీలక దశలో ఉన్నట్లు పేర్కొన్నాయి. కిమ్‌ కూడా వంశపారం పర్యంగా అధికారానికి వచ్చాడని నిఘా వర్గాల మాట. ఈ నెల చివరలో కిమ్‌కు చెందిన వర్కర్స్‌ పార్టీ సదస్సు జరగనుందని, ఆ వేదికగా వారసత్వ ప్రణాళికలను పార్టీ పరంగా ఆమోదముద్ర వేసుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×